Begin typing your search above and press return to search.

ఏపీలో వచ్చేది బలమైన ప్రతిపక్షం ?

ఏపీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చూస్తూంటే ఏ పార్టీకి వేవ్ కనిపించడంలేదు అని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు

By:  Tupaki Desk   |   26 April 2024 2:45 AM GMT
ఏపీలో వచ్చేది బలమైన ప్రతిపక్షం ?
X

ఏపీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చూస్తూంటే ఏ పార్టీకి వేవ్ కనిపించడంలేదు అని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. అధికార వైసీపీ అయిన టీడీపీ కూటమి అయినా గెలుపు కోసం చమటోడ్చాల్సిందే అని అంటున్నారు. అందుకే మండుటెండలను లెక్క చేయకుండా అధినాయకులు అంతా ఊర్లను పట్టి తిరుగుతున్నారు.

అయినా సరే జనాల పల్స్ అందడం లేదు. దాంతో రాజకీయ పార్టీలకు కలవరం రేగుతోంది. ఇదిలా ఉంటే ఈసారి జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా వంద సీట్లలోపే వస్తాయని అంటున్నారు. అంటే భారీ మెజారిటీలు రావు అని అంటున్నారు. 2014లో విభజన తరువాత ఎన్నికలు ఏపీలో జరిగితే తెలుగుదేశం పార్టీకి 102 సీట్లు వచ్చాయి. అలాగే పొత్తు పెట్టుకుని 12 సీట్లకు పోటీ పడిన బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి.

ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా మద్దతు ఇచ్చింది. మోడీ క్రేజ్ ఉంది. పవన్ మీద అప్పట్లో ఉన్న మోజు వేరే లెవెల్. చంద్రబాబు అనుభవం మీద ఉన్న నమ్మకం అపారం. అయినా సరే టీడీపీ కూటమికి దక్కింది. 106 సీట్లు మాత్రమే. అంటే పాజిటివ్ వేవ్ నాడు కనిపించినా ఆ నంబరే వస్తే ఇపుడు ఏ వేవ్ లేని సందర్భంలో ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చకు తెర లేచింది.

వైసీపీ విషయానికి వస్తే 2014లో తొలిసారి పోటీ చేసిన ఆ పార్టీకి 67 సీట్లు లభించాయి. ఆనాడు జగన్ మీద ఎంతో మోజు ఉన్న సందర్భం. వైఎస్సార్ వారసుడి అన్న అభిమానం ఉంది. 2019లో అదే ప్రతిఫలించి ఆయనకు ఏకంగా 151 సీట్లు ఇచ్చేశారు. అంటే పీక్స్ కి చేరిన అభిమానంగా దాన్ని చూడాలి. ఈసారి ఎన్నికల్లో అయిదేళ్ళు పాలించిన ముఖ్యమంత్రిగా జగన్ జనం ముందుకు వచ్చారు

దాంతో సహజంగానే ప్రభుత్వం మీద ఉండే యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దానిని అధిగమించి గెలవాలీ అంటే బిగ్ టాస్క్. జగన్ ప్రభుత్వం మీద పట్టణాలలో తీవ్ర వ్యతిరేకత ఉందని బయటకు తెలుస్తోంది. పల్లెలలో ఎంత ఉంది అన్నది తెలియదు. అక్కడ తమకు అనుకూలం అని వైసీపీ చెప్పుకుంటోంది. పల్లెలే రక్షించి ఓట్లు వేస్తే అవి శ్రీ రామరక్షగా మారితే వైసీపీ 100 సీట్లతో గెట్టెక్కుతుందని సర్వే అంచనాలు ఉన్నాయి.

అదే టీడీపీ కూటమికి పట్టణాల్లో అదరణ ఉంది. ఇక్కడ అభివృద్ధిని కోరుకునే వారు కూటమికి ఓటేస్తారు అని చెబుతున్నారు. అయితే ఇది ఒక్కటే చాలదు. పల్లెలలో కూడా సాలిడ్ గా ఓట్లు రాబట్టుకోవాలి. ఆ విధంగా చూస్తే కనుక పల్లెలలో టీడీపీ సంక్షేమ పధకాలు కనుక జనాల మద్దతు అందుకుంటే బొటా బొటీ మెజారిటీతో అంటే 100 సీట్లతో గట్టెక్కే చాన్స్ ఉందని అంటున్నారు.

దీనిని బట్టి చూస్తే వైసీపీ టీడీపీ కూటమిలలో ఎవరు గెలిచినా వంద సీట్లకు మాత్రమే పరిమితం అవుతారు అని అంటున్నారు. అపుడు ప్రతిపక్షం బలంగా వస్తుంది అని అంటున్నారు. మిగిలిన సీట్లలో అంటే 75 సీట్లతో విపక్షం ఈసారి ఫుల్ స్ట్రాంగ్ గా హౌజ్ లో కనిపిస్తుందని అంటున్నారు.

అదే కనుక జరిగితే అయిదేళ్ల పాటు విపక్ష బలాన్ని తట్టుకుని సభను నడిపించడం అంటే కష్టసాధ్యమే అంటున్నారు. పైగా బిల్లుల పాస్ కి కూడా ఇది ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు. అసెంబ్లీలో ప్రతీ చర్చ కూడా గట్టిగానే ఉంటుంది అని అంటున్నారు. అలాంటి అసెంబ్లీ అవసరమే అని మేధావులు అంటున్నారు. బండ మెజారిటీలు ఇవ్వకుండా బలమైన ప్రతిపక్షం కూడా ఉంటేనే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి.

అయితే ఏపీ విభజన తో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా బొటా బొటీ మెజారిటీతో నడిస్తే అది రాష్ట్ర ప్రగతికి బ్రేకులు వేస్తుందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా చూస్తే కనుక అధికారంలోకి వచ్చే పార్టీకి 125 సీట్లు అయినా ఇస్తేనే సభ సాఫీగా సాగుతుందని, ప్రభుత్వం సజావుగా ఉంటుందని అంటున్నారు. మరి ఏపీ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే.