Begin typing your search above and press return to search.

పోలింగ్ ఒకెత్తు... ఆ 32, 20 తోనే అసలు టెన్షన్ అంతా!!

అవును... ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనల తాలూకు ప్రతిస్పందనలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   26 May 2024 5:45 AM GMT
పోలింగ్  ఒకెత్తు... ఆ 32, 20 తోనే అసలు టెన్షన్  అంతా!!
X

ఏపీలో అత్యంత రసవత్తరమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ సందర్భంగా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగిన అవాంఛనీయ ఘటనలు తెరపైకి వచ్చాయి. వాటి తాలుకు సెగలు, కేసులు, విమర్శలు, ప్రతి విమర్శలూ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ సంగతి సరే కానీ.. కౌంటింగ్ రోజు పరిస్థితి ఏమిటనే టెన్షన్ తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనల తాలూకు ప్రతిస్పందనలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంలో పోలీసు కేసులు, కోర్టు వ్యవహారాలు మొదలైన కథాకమీషులు నడుస్తున్నాయి. ఆ తాలూకు టెన్షన్ అలా ఉంటే... ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది.

ఇందులో భాగంగా... జూన్ 4న జరగబోతున్న కౌంటింగ్ విషయంలో అన్ని పార్టీల్లోనూ, అన్ని వర్గాల్లోనూ తీవ్ర టెన్షన్ నెలకొందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల‌కు కౌంటింగ్ ప్రక్రియ జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకూ ఏపీలో పొలిటికల్ వాతావరణం పీక్స్ లో ఉంటుందని అంటున్నారు.

ఈ క్రమంలో.. పోలింగ్ రోజు వ్యవహారంతో పోలిస్తే ఈ ప్రక్రియ మ‌రింత టెన్షన్ గా మార‌నుంద‌నేది అధికార వ‌ర్గాల అంచ‌నాగా ఉంది. అందుకూ బలమైన కారణం ఉంది. గతంలో ఎన్నికలు అంటె.. గెలుపు ఓటమి మాత్రమే. గెలిస్తే సంబరాలు అంబరాన్నంటేవి.. ఓడితే మౌనంగా ఉండటం చేసేవారు.

అయితే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ప్రధానంగా... ఏపీలో అయితే పరిస్థితి మరింత పీక్స్ కి చేరిందని చెబుతున్నారు. ఓ వైపు బెట్టింగులు.. మరోవైపు పంతాలు, పట్టింపులతో వాతావరణం తీవ్రంగా వేడెక్కింది. పైగా ఇప్పుడు నాయకులకంటే ఎక్కువగా కార్యకర్తలకంటే మరెక్కువా సామాన్య ప్రజానికంలోనూ ఈ తరహా వాతావరణం కనిపిస్తుంది.

దీనికి తోడు 32 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను స‌మ‌స్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించారు. ఇదే సమయంలో... మ‌రో 20 నియోజ‌క‌వ‌ర్గాలను అత్యంత స‌మ‌స్యాత్మకంగా చెబుతున్నారు. దీంతో... ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది అంచ‌నా కు కూడా అంద‌డం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరి జూన్ 4న అటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు అధికారులు.. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది వేచి చూడాలి!