Begin typing your search above and press return to search.

చైనా ల్యాబ్స్ లో సరికొత్త వైరస్... నెక్స్ట్ బర్త్ డే ఉండదు ప్రామిస్!

అవును... ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ పుట్టినిల్లుగా చెప్పబడే చైనాలో మరో వైరస్ కు సంబంధించిన చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   29 May 2024 12:33 PM GMT
చైనా ల్యాబ్స్  లో సరికొత్త వైరస్... నెక్స్ట్  బర్త్  డే  ఉండదు ప్రామిస్!
X

చైనా - వైరస్... ఈ రెండు పదాలు పక్క పక్కన పెట్టి చదవడం అంటే మనసు ఏమాత్రం అంగీకరించదని అంటారు. చదవాల్సి వస్తే మాత్రం ముచ్చెమటలు కన్ ఫాం అని చెబుతుంటారు. కరోనా మహమ్మారి రూపంలో ప్రపంచాన్ని చైనా వణికించేసిందనే చెప్పాలి! ఆ వైరస్ పేరు చెబితే భూగ్రహానికే ముచ్చెమటలు అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో చైనాలో మరో వైరస్ తెరపైకి వచ్చింది!

అవును... ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ పుట్టినిల్లుగా చెప్పబడే చైనాలో మరో వైరస్ కు సంబంధించిన చర్చ మొదలైంది. అయితే దాని తయారికి గల కారణాన్ని చైనా చెబుతున్న విధానంతో ప్రపంచానికి మరో టెన్షన్ తప్పదా అనే చర్చా తెరపైకి వచ్చింది. దీంతో... ఏమిటా వైరస్, దాన్ని ఎందుకు అభివృద్ధి చేశారు, దానికి చైనా చెబుతున్న కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం...!

వివరాళ్లోకి వెళ్తే... హెబీ మెడికల్ యూనివర్సిటీలో చైనాలోని శాస్త్రవేత్తలు కేవలం మూడు రోజుల్లో ఒక వ్యక్తిని చంపగల కొత్త వైరస్‌ ను రూపొందించారట! ఎబోలా వైరస్ ను పోలిన ఈ సరికొత్త సింథటిక్ వైరస్ ను తాజాగా సుమారు 10 చిట్టెలుకలపై ప్రయోగించారంట. దీంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో అవి మూడురోజుల్లోనే మరణించాయని చెబుతున్నారు.

అవును... ఈ చిట్టెలుకలు చనిపోయిన తరువాత, పరిశోధకులు వాటి అవయవాలను కోసి.. వైరస్ ప్రభావాన్ని విశ్లేషించారట. ఈ సమయంలో... గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేగులు, మెదడు వంటి కణజాలాలలో వైరస్ పేరుకుపోయినట్లు కనుగొన్నారని తెలుస్తుంది దీంతో... ఇది మానవులలో కూడా ఇదే స్థాయిలో వినాశకరమైన ప్రభావాలను చూపిస్తుందని అంటున్నారు!

అయితే ఈ సింథటిక్ వైరస్ పై చైనా వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ఇందులో భాగంగా... మనిషిపై ఎబోలా ప్రభావం, దానికి చికిత్స మార్గాలను కనుగొనడమే ఉద్దేశ్యంగా ఈ ప్రయోగం చేసినట్లు చెబుతున్నారు. దీంతో... పొరబాటున కానీ ఉద్దేశపూర్వకంగానే కానీ ఈ వైరస్ ల్యాబ్ నుంచి జనాల్లోకి వస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

కాగా... అధిక మరణాల రేటు, తీవ్రమైన లక్షణాల కారణంగా ఎబోలా వైరస్ ప్రాణాంతక వైరస్‌ లలో ఒకటిగా పరిగణిస్తారనే సంగతి తెలిసిందే. ఇది చివరిగా 2014 -2016 మధ్య తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇందులో భాగంగా ప్రధానంగా అనేక పశ్చిమ ఆఫ్రికా దేశాలను ప్రభావితం చేసింది.. అనేక మరణాలకు దారితీసింది.