Begin typing your search above and press return to search.

హరీష్ మీదే కోపమా ?

ఈ మొత్తం మీద హరీష్ మీద అభ్యర్ధులతో పాటు రైతుల్లో బాగా మండిపోతోందట. హరీష్ చేసిన ప్రచారం వల్లే కమీషన్ అనుమతిని రద్దుచేసిందనే గోల పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 2:30 PM GMT
హరీష్ మీదే కోపమా ?
X

రైతుబంధు మంటలు ఇంకా అధికార బీఆర్ఎస్ పార్టీలో మండుతునే ఉన్నాయి. రైతుబంధు పథకం అమలుకు కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఒకరోజు తర్వాత మళ్ళీ రద్దుచేసింది. అనుమతి-రద్దు తాలూకు మంటలు పార్టీలో రకరకాలుగా మండుతున్నది. ఇందులోనే ఇదంతా కేసీయార్ గేమ్ ప్లానులో భాగమే అనే ప్రచారం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకీ విషయం ఏమిటంటే రైతులకు పెట్టుబడిగా ప్రభుత్వం రైతులకు రైతుబంధు పథకంలో డబ్బులిస్తోంది.

సుమారు 70 లక్షలమంది రైతులకు తలా రు. 5 వేల చొప్పున ఖాతాల్లో వేస్తోంది. అయితే ఇపుడు సీజన్ దాటిపోయినా రైతులఖాతాల్లో డబ్బుపడలేదు. కారణం ఏమిటంటే రైతురుణమాఫీ హామీ అమలుకే ఎక్కడలేని డబ్బు కేసీయార్ ప్రభుత్వానికి సరిపోలేదు. ఇంకా సుమారు 20 లక్షల మంది రైతులకు రు 8500 కోట్లు పెండింగులో ఉంది. ఈ నేపధ్యంలోనే రైతుబంధు పథకం అమలుకు అనుమతి ఇవ్వమని కేసీయార్ ప్రభుత్వం ఎన్నికల కమీషన్ కు లేఖ రాసింది.

అనుమతించిన కమీషన్ పథకాన్ని ప్రచారం చేసుకోవద్దని స్పష్టంగా చెప్పింది. అయితే కమీషన్ అనుమతిస్తుందని కేసీయార్ ఊహించలేదు. అందుకనే ఎన్నికలు అయిపోయిన తర్వాత డబ్బులు ఖాతాల్లో వేస్తామని బహిరంగసభల్లో చెబుతున్నది. అయితే ఊహించని విధంగా కమీషన్ అనుమతి ఇవ్వటంతో ఏమిచేయాలో తోచలేదు. ఇంతలో మంత్రి హరీష్ ప్రచారంలో మాట్లాడుతు 28వ తేదీన రైతుల ఖాతాల్లో టింగు టింగు అంటు డబ్బులు పడిన మెసేజీలు వస్తాయని ప్రకటించారు. ఆ విషయం ఎన్నికల కమీషన్ దృష్టికి వెళ్ళటంతో వెంటనే అనుమతులను రద్దుచేసింది.

ఇపుడా విషయంపైనే కేసీయార్ అండ్ కో కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ కూడా కేసీయార్ అండ్ కో మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఈ మొత్తం మీద హరీష్ మీద అభ్యర్ధులతో పాటు రైతుల్లో బాగా మండిపోతోందట. హరీష్ చేసిన ప్రచారం వల్లే కమీషన్ అనుమతిని రద్దుచేసిందనే గోల పెరిగిపోతోంది. అయితే ఇదంతా కేసీయార్ గేమ్ ప్లాన్లో భాగంగానే హరీష్ తో నాటకాలు ఆడించారనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.