Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌.. ఫుల్ సైలెంట్‌.. ..!

ఎలా చూసుకున్నా.. వైసీపీ కి కీల‌క‌మైన ఫైర్‌బ్రాండ్‌గా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన అనిల్ కుమార్‌.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 2:30 PM GMT
మాజీ మంత్రి అనిల్‌కుమార్‌.. ఫుల్ సైలెంట్‌..  ..!
X

వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు, అసెంబ్లీ వేదిక‌గానే స‌వాళ్లు రువ్విన నేత‌.. మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్‌. నెల్లూరు జిల్లాలోని రూర‌ల్‌, సిటీ నియాజక‌వ‌ర్గాలే కాకుండా.. ఒక‌టి రెండు నియో జక‌వ‌ర్గాల్లోనూ త‌న ఆధిప‌త్య ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. త‌న వారిపైనే త‌ను క‌త్తి దూసిన‌ట్టు వ్య‌వ హ‌రించారు. ఇదంతా వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగింది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి య‌ట‌ర్న్ తీసుకుంది. అనిల్‌ కుమార్ జాడ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

ఈ ఏడాది ఎన్నిక‌ల్లో నెల్లూరును వ‌దిలి.. అధినేత జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌.. నెల్లూరు సిటీ నుంచే త‌న రాజ‌కీయా లు ప్రారంభిస్తాన‌ని చెప్పినా.. ఆదిశ‌గా అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. దీంతో అనిల్ కుమార్ మౌనంగా ఉండిపోయారనే టాక్ వినిపిస్తున్నా.. మ‌రోవైపు మంత్రి నారాయ‌ణ‌కు ఆయ‌న భ‌య ప‌డుతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నెల్లూరు జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉన్నారు. ఇద్ద‌రూ కూడా.. అనిల్‌ను టార్గెట్ చేసుకున్నార‌ని ఒక చ‌ర్చ సాగుతోంది. దీంతో తాను ఏమాత్రం పుంజుకున్నా.. ఫైర్‌బ్రాండ్ మాదిరిగా రెచ్చిపోయినా.. మునుప టి మాదిరిగా ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంచ‌నా వేసుకున్నార‌ని.. అందుకే కొన్నాళ్లు మౌనంగా ఉండాల‌ని భావి స్తున్నార‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. ఇంకోవైపు.. సొంత బాబాయి.. కూడా టీడీపీలోనే ఉండ‌డం.. ఆయ‌న కూడా.. అబ్బాయిని ఇరికించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న చ‌ర్చ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఎలా చూసుకున్నా.. వైసీపీ కి కీల‌క‌మైన ఫైర్‌బ్రాండ్‌గా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన అనిల్ కుమార్‌.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్ర‌తి ఒక్క‌రినీ టార్గెట్ చేసుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన కార‌ణంగా ఇప్పుడు అనిల్‌ను ప‌ట్టించుకునే వారు కూడా క‌రువ‌య్యారు. ఎవ‌రూ కూడా ఆయ‌న‌కు చేరువ కాలేక పోతున్నారు. క‌నీసం ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా..అనిల్ రాజ‌కీయాల గురించి ఆలోచిస్తున్న‌వారు కానీ.. పార్టీ అధిష్టానం కూడా.. ఆయ‌న‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లా కానీ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.