జగన్ పక్కన మెరిసిన అనిల్...మ్యాటరేంటి ?
నిజానికి అనిల్ కుమార్ 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు వెంకటగిరి మీద మొగ్గు చూపించారు.
By: Tupaki Desk | 11 April 2025 5:57 PMనెల్లూరు జిల్లాకు చెందిన యువ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన 2014 నుంచి 2024 దాకా పదేళ్ళ కాలంలో ఎంతలా రాజకీయాల్లో ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చి తన హవా చాటుకున్నారో. ఆయన వైసీపీకి బిగ్ వాయిస్ గా మారిపోయారు. ఫైర్ బ్రాండ్ గా ఆయన ఒక దశలో వైసీపీలో అత్యంత కీలక నాయకులలో ఒకరిగా మెలిగారు.
అటువంటి అనిల్ కుమార్ నెల్లూరు జిల్లాను వైసీపీ అధికారంలో ఉన్నపుడు అయిదేళ్ల పాటు శాసించారు. ఇక ఆయన మాట మీదనే రాజకీయం సాగింది. దాని వల్ల అనేక మంది పార్టీ పెద్ద లీడర్లు వైసీపీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ నుంచి పోటీ చేసి అనిల్ ఓటమి పాలు అయ్యారు.
గత పది నెలలుగా అనిల్ కుమార్ యాదవ్ అయితే ఎక్కడా బయటకు కనిపించడంలేదు. ఆయన నెల్లూరు అర్బన్ సీటుకు వైసీపీ ఇంచార్జి గా కొత్తవారిని పెట్టారు. ఇక అనిల్ అయితే చెన్నైలో తన సొంత వ్యాపారాలతో బిజీగా ఉన్నారు దాంతో అనిల్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా అన్న చర్చ సాగింది.
అయితే ఉన్నట్లుండి అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లి ఆఫీసులో అధినేత జగన్ పక్కన కనిపించారు. దీంతో ఏమి జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. అనిల్ మళ్ళీ యాక్టివ్ అవుతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తునారు.
అయితే జగన్ తో అన్నీ మాట్లాడిన తరువాత అనిల్ తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన నెల్లూరు సిటీ నుంచి కాకుండా అదే జిల్లాలో మరో కీలక నియోజకవర్గంగా ఉన్న వెంకటగిరి నుంచి తన కొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు.
నిజానికి అనిల్ కుమార్ 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు వెంకటగిరి మీద మొగ్గు చూపించారు. అయితే అధినాయకత్వం మాత్రం ఆయనను నరసారావుపేటకు పంపించింది. ఇక ఇపుడు ఆయన తన కోరిక హైకమాండ్ ముందు పెట్టడంతో దానికి ఓకే చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.
అంతే కాదు ఆయన మీద మరిన్ని పార్టీ బాధ్యతలను కూడా హైకమాండ్ పెడుతోంది అని అంటున్నారు. ఇక వెంకటరిగిలో చూస్తే మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. ఇటీవల ఆయన నాయకత్వంలో వెంకటగిరి మునిసిపాలిటీ చైర్మన్ మీద టీడీపీ పెట్టిన అవిశ్వాసాన్ని నెగ్గి మరీ సత్తా చాటింది.
నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆయనకు ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చింది. ఇక 2024లో ఆయనకు టికెట్ దక్కింది కానీ ఓటమి పాలు అయ్యారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీసీలు అధికంగా ఉన్న ఈ సీటు నుంచి అనిల్ కుమార్ ని దింపితే వచ్చే ఎన్నికల్లో విజయం సొంతం చేసుకోవచ్చు అని జగన్ ఆలోచిస్తున్నారు
అని అంటున్నారు.
మొత్తానికి అనిల్ వెంకటరిగి నుంచి తన కొత్త పాలిటిక్స్ ని స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. మరి అనిల్ ఫైర్ బ్రాండ్ ని మరోసారి వైసీపీ చూస్తుందా ఆయన ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వచ్చి గతంలో మాదిరిగా స్పీడ్ పెంచుతారా అన్నది అయితే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.