Begin typing your search above and press return to search.

అనిల్ కుమార్ కూడానా... వైసీపీలో లిస్ట్ పెద్దదేనా ?

ఆయన ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద రకరకాలైన చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   5 Nov 2024 9:30 PM GMT
అనిల్ కుమార్ కూడానా... వైసీపీలో లిస్ట్ పెద్దదేనా ?
X

నెల్లూరు జిల్లాలో ఒకనాడు కీలక నేతగా ఉండి జగన్ మంత్రివర్గంలో తొలి చాన్స్ ని దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఈ మధ్య ఫుల్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఆయన ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద రకరకాలైన చర్చ సాగుతోంది. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీకి దూరంగా తన వ్యాపారాలకు దగ్గరగా ఉంటున్నారు అన్నది ఒక ప్రచారం అయితే ఆయన కొంతకాలం పాటు పాలిటిక్స్ కే దూరం గా ఉంటారు అన్నది మరో చర్చ.

ఇంతే కాదు అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తు మీద సుదీర్హమైన ఆలోచనలో పడి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటున్నారు అన్నది మరో చర్చ. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో అనిల్ వాయిస్ అయితే వినిపించడంలేదు. ఈ విషయాలు పక్కన పెడితే అనిల్ కుమార్ యాదవ్ అంటే జగన్ కి వీర విధేయుడు అని ఎవరైనా ఠక్కున చెబుతారు.

జగన్ ఆయనకు ఎంత ప్రయారిటీ ఇచ్చారూ అన్నది కూడా చెబుతారు. నెల్లూరు పెద్దారెడ్లకు నిలయం అయిన ప్రాంతంలో అనిల్ ని వెన్ను తట్టి నిలబెట్టిన జగన్ ఆయన కోసం బిగ్ షాట్స్ ని ఎందరినో వదులు కున్నారు అని కూడా చెబుతారు. రీసెంట్ గా చూస్తే ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీని వీడిపోవడానికి కారణం అనిల్ కుమార్ టికెట్ విషయం అని కూడా అంటారు. నెల్లూరు అర్బన్ టికెట్ తన సతీమణికి ఇవ్వమని వేమిరెడ్డి కోరారని కూడా ప్రచారంలో ఉంది.

అయినా అనిల్ కే ఓటేసిన నేపధ్యంలోనే వైసీపీ అధినాయకత్వం నెల్లూరు జిల్లాలో భారీ డిజాస్టర్ ని పొలిటికల్ గా చూసింది అని అంటారు. ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నికలు అయిపోయాయి. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చేసింది. ఇపుడు మాట్లాడే గొంతుకలు కావాలి. జనంలో ఉండి పోరాడే వారు కావాలి.

అయితే అనిల్ కుమార్ ఎక్కడ అన్న చర్చ నడుస్తోంది. ఆయన అయితే ప్రస్తుతానికి కాం గా ఉన్నా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీలో మళ్లీ తనకు పూర్వపు స్థానం దక్కదని అనుమానిస్తున్నారో లేక అక్కడ ఉంటే అన ఫ్యూచర్ ఇక ఇంతేనని భావిస్తున్నారో అని అంటున్నారు.

దాంతో ఆయన కూడా పార్టీ మారుతారు అన్న చర్చ అయితే నడుస్తోంది. ఆయన జనసేనలోకి వెళ్తారు అన్నది లేటెస్ట్ టాక్. ఆయన గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి జగన్ హీరో అంటూ ఆయన తన దూకుడు కొనసాగించారు. ఆ సమయంలో ఆయన పవన్ మీద కూడా నేరుగా విమర్శలు చేశారు.

అయితే ఇపుడు మాత్రం ఆయన సైలెంట్ గా ఉంటూ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కి పదును పెడుతున్నారని అంటున్నారు. టీడీపీలో తన ప్రత్యర్థులు ఆల్ రెడీ ఉన్నందువల్ల తాను జనసేనలోకి వెళ్తే సేఫ్ అని ఆయన భావిస్తున్నారు అన్న పుకార్లు అయితే షికారు చేస్తున్నాయి. అదే జరిగితే అనిల్ కుమార్ యాదవ్ రూపంలో వైసీపీకి నెల్లూరులో ఒక దెబ్బ పడే చాన్స్ ఉంది. మరి ఈ విషయాలు అన్నీ వైసీపీ అధినాయకత్వానికి తెలుసా అన్నది మరో చర్చ.

ఇదిలా ఉంటే ఆయన ఒక్కరే కాదు తన గుండె విప్పి చూపిస్తే జగన్ బొమ్మ కనిపిస్తుందని చాలా భారీ డైలాగులు కొట్టిన కొందరు వైసీపీ బిగ్ షాట్స్ సైతం జెండా మార్చేయబోతున్నారు అని అంటున్నారు. ఆ లిస్ట్ కూడా చాలా పెద్దదే అని అంటున్నారు. మరి వారు అంతా సైకిలెక్కుతారా లేక గాజు గ్లాస్ పట్టుకుంటారా అన్నది చూడాల్సి ఉందని పుకారులు బాగానే వినిపిస్తున్నాయి. సో వెయిట్ అండ్ సీ.