Begin typing your search above and press return to search.

చరిత్ర కూడా క్షమించదు... షర్మిళపై అనిల్ ఘాటు వ్యాఖ్యలు!

ఇదే క్రమంలో... ఏపీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యదవ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:54 AM GMT
చరిత్ర కూడా క్షమించదు... షర్మిళపై  అనిల్  ఘాటు వ్యాఖ్యలు!
X

ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ షర్మిల.. పీసీసీ చీఫ్ హోదాలో చేసిన తొలి ప్రసంగంలో సీఎం వైఎస్‌ జగన్‌ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మధ్య మధ్యలో చంద్రబాబుని నాలుగు మాటలు అంటూ.. జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటికి కనిపించడం లేదని, రోడ్లు బాగుచేయలేదని, రాజధాని లేదని విమర్శలు గుప్పించారు.

ఈ సమయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. పూర్తి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఒకరంటే.. తమతో వస్తే ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తామని మరొకరన్నారు. ఇదే క్రమంలో... చంద్రబాబుకు మేలు చేసేందుకే షర్మిల రంగంలోకి దిగారని, పొరపాటు చేస్తే చరిత్ర కూడా క్షమించదని ఇంకొకరు దుయ్యబట్టారు. ఇలా షర్మిలపై ముప్పేట దాడి షురూ చేశారు.

అవును... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై వైసీపీ నాయకులు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా... మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, మంత్రి ఉషాశ్రీ చరణ్‌.. షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చంద్రబాబు క్షేమం కోసం చేస్తున్న పనిగానే అభివర్ణించారు.

ఇందులో భాగంగా స్పందించిన వైవీ సుబ్బారెడ్డి... వైఎస్‌ జగన్‌ ను 16 నెలల పాటు జైల్లో పెట్టిన కాంగ్రెస్‌ గురించేనా మాట్లాడుతున్నది అంటూ గతాన్ని గుర్తుచేస్తూ ప్రశ్నించారు. ఇదే సమయంలో... ఏపీ ప్రయోజనాలు కాపాడుకోవటానికి, పోర్టులకు నిధుల తెచ్చుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడూ తాకట్టుపెట్టడం లేదని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ప్రసంగాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు... నాడు ఎందుకు విభజన చట్టంలో ఆ విషయాన్ని ఎందుకు పెట్టలేదో చెప్పాలని మంత్రి ఉషశ్రీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాడు రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీనే కారణమని ఆరోపించారు.

చరిత్ర కూడా క్షమించదు!:

ఇదే క్రమంలో... ఏపీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యదవ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఏపీలో వైఎస్‌ జగన్‌ ను, వైసీపీ పార్టీని ఇబ్బందులు పెట్టేందుకే షర్మిల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ చిరకాల ప్రత్యర్థి అయిన చంద్రబాబుకు మేలు చేకూరే విధంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలోని వైసీపీకి వెన్నుముఖగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు చీల్చి కాంగ్రెస్‌ పార్టీకి లబ్ధి చేస్తున్నారా..? కాంగ్రెస్‌ ను వెనుకుండి నడిపిస్తున్న చంద్రబాబుకు లబ్ధి చేకూరుస్తున్నారా? అనేది గుండెల్లో మీద చేయి వేసుకుని ఆలోచించాలని అన్నారు. ఈ సందర్భంగా... ఒక్క పొరపాటు చేస్తే చరిత్ర కూడా క్షమించదని, చరిత్రపుటల్లో మాయని మచ్చగా నిలిచిపోతారని అనిల్ ఘాటుగా స్పందించారు.