Begin typing your search above and press return to search.

అనిల్ బ్రో ఎక్కడ...నెల్లూరు లో ఇదే హాట్ డిస్కషన్ !

జగన్ కి నమ్మిన బంటుగా ఉంటూ ఏకంగా రెడ్ల ఆధిపత్యం ఉన్న నెల్లూరు వంటి జిల్లాలో ఒక స్థాయిలో చక్రం తిప్పారు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 12:38 PM GMT
అనిల్ బ్రో ఎక్కడ...నెల్లూరు లో ఇదే హాట్ డిస్కషన్ !
X

అనిల్ కుమార్ యాదవ్. ఈ పేరు వైసీపీ అధికారంలోకి వచ్చాక మారు మోగిపోయింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ మినిస్టర్లలో అనిల్ కుమార్ ఒకరు. జగన్ కి నమ్మిన బంటుగా ఉంటూ ఏకంగా రెడ్ల ఆధిపత్యం ఉన్న నెల్లూరు వంటి జిల్లాలో ఒక స్థాయిలో చక్రం తిప్పారు. రాజకీయాల్లో ఆయన జెట్ స్పీడ్ తో ఎదిగారు.

నెల్లూరు సిటీలో రెడ్లదే ఎపుడు విజయం. వారిదే ఆ సీటు. అలాంటి చోట అనిల్ కుమార్ టికెట్ సాధించి 2014లో గెలిచారు. ఆనాడు విపక్షంలోనూ తనదైన దూకుడు చూపించారు. అలా జగన్ కి అభిమాన పాత్రుడు అయ్యారు. ఇక 2019లో చూస్తే ఆయన జగన్ వేవ్ లో గెలవడమే కాకుండా ఏకంగా మంత్రిగా కూడా తొలి విడతలో అయిపోయారు.

మూడేళ్ళ పాటు అత్యంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయినా సరే ఆయన జిల్లాకు కానీ తన శాఖకు కానీ చేసింది ఏమీ లేదని విమర్శలు వినిపించాయి. అంతే కాదు జిల్లాలో సొంత పార్టీ నేతలతోనే ఆయన పేచీలు పెట్టుకున్నారని అంటారు. బలమైన రెడ్ల రాజకీయ ఆధిపత్యాన్ని ఆయన సవాల్ చేశారు.

తనకు జగన్ అండదండలు ఉన్నాయాని చాలానే అతి చేశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయనకు మంత్రి పదవి పోగానే వెంట ఉండే వారు ఎవరో తెలిసిపోయింది. ఆఖరుకు సొంత చిన్నాన్న కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. రాజకీయంగా ఒంటరిగా మిగిలిన అనిల్ కుమార్ ని జగన్ నెల్లూరు నుంచి నర్సారావుపేటకు షిఫ్ట్ చేసి ఎంపీ టికెట్ ఇచ్చారు.

కూటమి ప్రభంజనంలో అనిల్ ఓడిపోయారు. ఆ తరువాత ఆయన ఒకటి రెండు సందర్భాలు తప్పించి ఇక కనిపించినది లేదు అని అంటున్నారు. వైసీపీకి నెల్లూరులో బలమైన బీసీ నేతగా యువకుడిగా ఉంటారని ఆశించి జగన్ ప్రోత్సాహం అందిస్తే ఇపుడు అనిల్ కనిపించడం లేదని అంటున్నారు.

ఆయన పార్టీని పక్కన పెట్టేసి తన సొంత బిజినెస్ లు చూసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయనకు చెన్నైలో వ్యాపారాలు ఉన్నాయట. అలాగే హైదారాబాద్ లోనూ బిజినెస్ ఉందని వాటిని ఆయన చూసుకుంటున్నారని రాజకీయాలని దాదాపుగా వదిలిపెట్టారని అంటున్నారు. ఇక అపుడపుడు నెల్లూరు వస్తూ తన సన్నిహితులను కలుసుకుంటున్నారు అని అంటున్నారు.

ఆయన రాక పోకల గురించి కానీ ఆయన గురించి కానీ క్యాడర్ కి సమాచారం ఉండటం లేదని అంటున్నారు. మరి జగన్ అనిల్ లాంటి లీడర్లను నమ్ముకుని బలమైన నేతలను దూరం చేసుకున్నారు. మరి అనిల్ లాంటి వారు ఇపుడు పార్టీ కోసం గట్టిగా నిలబడాల్సి ఉంది కదా అన్న చర్చ సాగుతోంది. అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం బలంగా ఉండటంతో కొన్నాళ్ళ పాటు రాజకీయాలకు రెస్ట్ ఇద్దామని అనిల్ భావించి ఉండవచ్చు అని అంటున్నారు.

ఎన్నికలకు అయిదేళ్ళ కాలం ఉంది. అందువల్ల ఈలోగా సొంత వ్యాపారాలు చూసుకుంటే బెటర్ అని భావించినట్లుగా ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద అనిల్ బ్రో ఎక్కడ అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ జవాబు అయితే దొరకడం లేదుట. కేవలం నెల్లూరులోనే కాదు ఏపీలో అన్ని జిల్లాలలోనూ ఈ విధంగానే ఉంది అని అంటున్నారు. మరి ఈ విషయంలో అధినాయకత్వం ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.