Begin typing your search above and press return to search.

ఓటమిపై అనిల్ ఆత్మవిమర్శ పూర్తై క్లారిటీ వచ్చేసిందా?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jun 2024 6:11 AM GMT
ఓటమిపై అనిల్  ఆత్మవిమర్శ పూర్తై  క్లారిటీ వచ్చేసిందా?
X

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఓటమిపై ఈవీఎం ల ట్యాంపరింగ్ అని ఒకరంటే.. మరొకరు మరో కారణం చెబుతున్నారు. జగన్ అయితే... ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సరికొత్త రీజన్ ని కన్ఫాం చేస్తున్నారు!!

అవును.. ఏపీలో తమ పార్టీ ఘోర ఓటమికి వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈవీఎం ల ట్యాపరింగ్, వాలంటీర్లు, ఐప్యాక్ ఇలా రకరకాల కారణాలు చెబుతుండగా... సరికొత్త కారణాన్ని తెరపైకి తెచ్చారు అనిల్ కుమార్ యాదవ్. ఇందులో భగంగా మంత్రుల నోటి దూల వల్లే వైసీపీ ఓటమిపాలైందనే విషయాన్ని తెరపైకి తెచ్చారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్... తాము చేసిన పొరపాట్లవల్ల, అధికారంలో ఉన్నప్పుడు చేసిన పలురకాల పనుల వల్ల ఓడిపోయి ఉండొచ్చని అంటూ... ఈ క్రమంలో కొంతమంది మాత్రం.. మంత్రుల నోటి దూల వల్ల ఓడిపోయినట్లు చెబుతున్నారని.. ఎస్... నిజంగా మా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటామని అన్నారు.

ప్రజలు మా అందరి ప్రవర్తన అలా ఉండబట్టే ఈ ఫలితాలు ఇచ్చారని భావిస్తే వాటిని తప్పకుండా సరిదిద్దుకుంటామని అన్నారు. ఇదే సమయంలో ప్రజల తీర్పు మేరకు తప్పులు సరిదిద్దుకుంటామని.. తొందర్లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తామని తెలిపారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు కొంతమంది చెబుతున్నారని.. ఫలితాలు వచ్చి వారమే అయ్యిందని.. తానెక్కడికీ పారిపోలేదని తెలిపారు.

ఫలితాలు వచ్చిన వెంటనే, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే రోడ్లపై పడలేమని.. కొత్త ప్రభుత్వానికి కాస్త టైం ఇస్తామని అన్నారు. ఇక, తమ భాష వల్లే తాము ఓడిపోయామని అంటుంటే... ప్రస్తుతం టీడీపీ నేతల భాష కూడా అలానే ఉందని.. అది వారు మార్చుకోకపోతే 2029లో టీడీపీ నేతలు కూడా ఓడిపోతారని స్మూత్ గా హెచ్చరికలు జారీచేశారు.

ఈ నేపథ్యంలో... వైసీపీ భారీ ఓటమితో పాటు తన ఓటమిపైనా అనిల్ కుమార్ యాదవ్ ఆత్మవిమర్శ పూర్తై ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ ఆత్మవిమర్శ పూర్తై ఒక స్పష్టమైన క్లారిటీకి ఆయన వచ్చి ఉంటారని.. అందువల్లే ఇలా బహిరంగంగా నాటి మంత్రుల నోటి దూల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు!