బాలయ్య బ్లెస్సింగ్స్ కోరిన హోంమంత్రి... వీడియో వైరల్!
ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు హోంమంత్రి అనిత.
By: Tupaki Desk | 18 Oct 2024 10:49 AM GMTసాధారణంగా పెద్దవాళ్లు ఎవరైనా కనిపిస్తే.. వాళ్ల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం సహజమే! ఇక రాజకీయలకు వచ్చేసరికి.. పార్టీ అధినేత పాదాలకు నాయకులు, కార్యకర్తలు నమస్కరిస్తుంటారు.. అధినేత ఆశీర్వాదాలు కోరుకుంటుంటారు. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు హోంమంత్రి అనిత.
అవును... హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు బాలయ్యబాబు ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో.. పక్కనే ఉన్న మరో మంత్రి సవిత.. బాలయ్యకు వినయంగా నమస్కరించారు.
దీంతో... బాలయ్యపై ఉన్న అభిమానంతో ఆమె అలా చేసి ఉంటారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక ఇటీవల జరిగిన సార్వతిక ఎన్నికల్లోనూ గెలిచి.. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక పాయకరావుపేట నుంచి పోటీ చేసిన అనిత.. 43,727 ఓట్లతో గెలిచారు. హోంమంత్రి అయ్యారు!
కాగా.. నేతలు, కార్యకర్తలు, ప్రజలు తన కాళ్లకు నమస్కరించే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎంతవారిస్తున్నా తన కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారని.. ఎవరైనా తన కాళ్లకు మొక్కితే.. తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
దీంతో... చంద్రబాబు లాంటి పెద్దవాళ్లు కనిపించినప్పుడు ఆశీస్సులు తీసుకోకుండా ఎలా ఉంటా..? ఈ విషయంలో టీడీపీ అధినేత తన సూచనను వెనక్కి తీసుకోవాలని ఆన్ లైన్ వేదికగా పలువురు కారకర్తలు విన్నవించారు!