ఎన్డీఏ - డీఎన్ఏ సాయిరెడ్డిపై అనిత షాకింగ్ కామెంట్స్!
ఇటీవల కాలంలో ఏపీలో జరిగిన ఘటనలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుస్తున్నారు.
By: Tupaki Desk | 28 July 2024 8:58 AM GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు అనే అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అటు అధికార పక్షం ప్రతిపక్ష వైసీపీని కార్నర్ చేయడానికి ఈ అంశాన్ని ఒక అస్త్రంగా వాడుతుండగా.. దీన్నే బ్రహ్మాస్త్రంగా చేసుకుని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై నిప్పులు కక్కుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో జరిగిన ఘటనలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుస్తున్నారు.
ఈ విషయంలో ఏ ప్రభుత్వ హయాంలో దారుణాలు ఎక్కువగా జరిగాయి.. అల్లర్లు పెట్రేగాయి.. హత్యలు, అత్యాచారాలు నెలకొన్నాయనే సంగతి కాసేపు పక్కనపెడితే ఈ శాంతిభద్రతల విషయం మాత్రం అటు అధికార కూటమి పక్షం, ఇటు విపక్ష వైసీపీ పక్షం మధ్య మాత్రం విపరీతమైన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, హోంమంత్రి అనిత మధ్య ట్విట్టర్ వేదికగా రెట్టల సెటర్లు నడుస్తున్నాయి!
అవును... ప్రస్తుతం ఏపీలో అత్యంత దారుణాలు, పాశవిక ఘటనలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ వైసీపీ నేతలు నిప్పులు కక్కుతున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టడం, దానికి జాతీయ స్థాయిలో పలు పార్టీల నుంచి మద్దతు లభించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్వీట్ చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి... "హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదు" అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో "బొల్లి" మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందని.. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి నెలకొందని.. దీనికి బాధ్యత హోంమంత్రిదే అని సాయిరెడ్డి అన్నారు.
ఇదే క్రమంలో... హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది హోంమంత్రి వైఫల్యమని, నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసిన సాయిరెడ్డి.. ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. దీంతో.. ఈ ట్వీట్ కు హోంమంత్రి అనిత తనదైన శైలిలో స్పందించారు.
ఇందులో భాగంగా.. "శాంతి"భద్రతల విషయంలో మీరు రాజీనామా చేయాలో నేను రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందంటూ అనిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో శాంతిభద్రతల్లో "శాంతి" కి ఇలా కోట్స్ పెట్టడంతో దేవాదాయశాఖ అధికారి టాపిక్ ఎత్తారనే చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో... తమది డీఎన్ఏ ప్రభుత్వం కాదని డీఎన్ఏ ప్రభుత్వం అని.. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు.
కాకపోతే దొంగలే కోటల్లో దాక్కొని ప్రెస్ మీట్లు, ఎక్స్ లో రెట్టలు వేస్తున్నారంటూ తనదైన శైలిలో స్పందించారు అనిత. ఇప్పుడు ఈ ట్వీట్ వార్ వైరల్ గా మారింది.