Begin typing your search above and press return to search.

ఎఫ్.బి. లవ్... అంజూ నిర్వాకం వల్ల ఫ్యామిలీ కొత్త కష్టాలివి!

By:  Tupaki Desk   |   4 Aug 2023 12:55 PM GMT
ఎఫ్.బి. లవ్... అంజూ నిర్వాకం వల్ల ఫ్యామిలీ కొత్త కష్టాలివి!
X

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ కు చెందిన అంజూ అనే మహిళ.. ఫేస్‌ బుక్‌ లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. అక్కడ విందులూ, వినోదాలతో ఆమె లైఫ్ హ్యాపీగానే ఉందని అంటున్నారు. అయితే ఎంపీలో ఆమె వల్ల ఫ్యామిలీ మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలుస్తోంది.

అవును... అంజూ చేసిన నిర్వాకంతో భారత్‌ లోని ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అంజూకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే పాకిస్థాన్ కు వెళ్లింది. ఈ క్రమంలో అంజూ భర్త, సోదరుడు, ఆమె తండ్రి తమ వృత్తి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా... అంజూ భర్తను ఆయన పనిచేస్తోన్న సంస్థ ఉద్యోగంలోనే ఉంచినప్పటికీ... ఆయనకు ఎలాంటి పని అప్పగించడం లేదట. ఆయన్ను బెంచ్‌ కు పరిమితం చేశారని అంటున్నారు. ఫలితంగా ఇదోటైపు వివక్షను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

ఇదే సమయంలో ఆమె సోదరుడు అయితే ఏకంగా ఉద్యోగమే కోల్పోయారట. తన సోదరి చేసిన పని ఫలితంగా... ఆమె సోదరుడి ఉద్యోగం పోయిందని అంటున్నారు. ఇక ఆమె ఆమె తండ్రి పరిస్థితి కూడా ఇలానే ఉందని స్థానిక మీడియా చెబుతోంది.

వృత్తిరీత్యా టైలర్‌ గా పనిచేస్తుంటారట అంజూ తండ్రి. అయితే ఈమె చేసిన నిర్వాకం వల్ల ఆమె తండ్రి పనిపై కూడా భారం పడిందని అంటున్నారు. చుట్టుపక్కల వారు ఆ కుటుంబానికి దూరంగా ఉండటంతో ఆయనకు కూడా పని లభించడం లేదని తెలుస్తోంది. ఇలా ఆమెచేసిన నిర్వాకం వల్ల ఫ్యామిలీ ఇబ్బందులు పడుతోంది.

అయితే అంజూ.. ప్రియుడి కోసం పాకిస్థాన్‌ వెళ్లిపోయిన తర్వాత బౌనా గ్రామంలో నివసించే ఆమె తండ్రిపై గ్రామస్థులు మొదట సానుభూతి చూపించారట. అయితే తర్వాత నుంచి వారు ఆయన పట్ల వ్యతిరేకత చూపించడం ప్రారంభించారట. దాంతో ఆయన టైలరింగ్ పని కుంటుపడిందని సన్నిహితులు వెల్లడించారని అంటున్నారు.

కాగా... అంజూ సరిహద్దులు దాటి వెళ్లడం, మతం మారడం, అక్కడ ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడటం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందేమో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని ఇటీవల మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించిన సంగతి తెలిసిందే.