Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ ప్రేమలో కొత్త ట్విస్ట్... ఆలు లేదు చూలు లేదట!

అవును అప్పటివరకూ స్నేహితురాలు, టూరిస్టు వీసా అని చెప్పిన నస్రుల్లా... స్లోగా మనసులో మాటను వదిలాడు.

By:  Tupaki Desk   |   27 July 2023 11:25 AM GMT
ఫేస్  బుక్  ప్రేమలో కొత్త ట్విస్ట్... ఆలు లేదు చూలు లేదట!
X

అంజు - నస్రుల్లా ఎపిసోడ్ సంగతి తెలిసిందే. ఫేస్‌ బుక్‌ లో పరిచయం.. అంజు రాజస్థాన్ నుంచి పాకిస్తాన్‌ కి వెళ్లడం.. అక్కడ నస్రుల్లాతో కలిపి ఒక వీడియో షూట్ చేయడం.. అనంతరం మతం మార్చుకుందని.. పెళ్లైందని కథనాలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది!

రకరకాల ట్విస్టులు, బోలెడన్ని జలక్కులతో నడుస్తోన్న "అంజూ - నస్రుల్లా" ఎపిసోడ్ లో తాజాగా ఒక బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... "నిన్న మీరు చూసిన షూట్ నిజమే కానీ అది వెడ్డింగ్ షూట్ కాదు" అంటోంది అంజు! పైగా పెళ్లి సర్టిఫికెట్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కూడా ఫేక్ అని అంటుంది.

అవును... అసలు తాము ప్రేమికులమే కాదని.. స్నేహితులమని.. ఇద్దరికీ కలిపి ఇంకా పెళ్లి కాలేదని.. పెళ్లి సర్టిఫికెట్ ఫేక్ అని.. ఫోటో షూట్ వరకూ కరెక్టే కానీ అది ప్రీ వెడ్డింగ్ షూట్ కాదని చెప్పుకొస్తోంది ఈ స్నేహ జంట! పైగా... త్వరలో ఇండియా వస్తానని అంటోంది అంజు!

ఈ విషయాలపై ముందుగా స్పందించిన నస్రుల్లా... తాను అంజుని పెళ్లి చేసుకోలేదని.. తమ పేరుతో వైరల్‌ అవుతున్న సర్టిఫికెట్‌ కూడా ఫేక్‌ అని.. అన్నీ పుకార్లేనని.. అంజు తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని.. తమ మధ్య స్నేహబంధం తప్ప ఇంకేమీ లేదని.. అంజు భారతీయురాలు కావడంతో.. భద్రత కోసం తాము పోలీసుల్ని సంప్రదించామని చెప్పుకొచ్చాడు.

అనంతరం... ఈ క్రమంలోనే కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చిందని.. పాకిస్తాన్‌ లో మహిళలు బుర్ఖా ధరించడం సాంప్రదాయం కాబట్టి అంజు కూడా బుర్ఖా ధరించిందని.. అంతే తప్ప ఆమె మతం మారలేదని.. ఇంకా ఇంకా హిందువుగానే ఉందని.. పాకిస్తాన్‌ చూడటానికి టూరిస్ట్ వీసా మీద ఇక్కడికి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అనంతరం చిన్న ట్విస్ట్ ఇచ్చాడు.

అవును అప్పటివరకూ స్నేహితురాలు, టూరిస్టు వీసా అని చెప్పిన నస్రుల్లా... స్లోగా మనసులో మాటను వదిలాడు. అందులో భాగంగా... తనకు అంజు అంటే ఇష్టమేనని.. ఆమె అంగీకరిస్తే పెళ్లి కూడా చేసుకుంటానని.. కానీ తుది నిర్ణయం ఆమెదేనని చెప్పుకొచ్చాడు

అనంతరం అంజు స్పందించింది. తాను నస్రుల్లాని వివాహం చేసుకోలేదని.. మతం కూడా మారలేదని.. ఇతరులు ఎలాగైతే టూరిస్ట్ వీసాపై పర్యాటక ప్రాంతాల్ని సందర్శించడానికి వెళ్తారో.. తాను కూడా అలాగే టూరిస్ట్ వీ సాపై పాక్‌ కి వెళ్లానని తెలిపింది. అనంతరం ఆమె కూడా చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చింది.

ఆగస్టు 4న తన వీసా గడువు ముగుస్తుందని.. భారత్‌ కు వచ్చాక తన వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చింది. దీంతో... పెళ్లై ఇంట్లో భర్తకు, పిల్లలకు చెప్పకుండా ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లిన ఈమె... జస్ట్ ఫ్రెండ్ అనడంపై ఆన్ లైన్ వేదికగా వాయించి వదులుతున్నారు నెటిజన్లు!

వీరిద్దరి కబుర్లూ ఇలా ఉంటే... అంజు తండ్రి గయ ప్రసాద్‌ థామస్‌ మాత్రం ఈ విషయంపై సీరియస్ గా స్పందించారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తును ఆమె చిదిమేసిందని.. తమ దృష్టిలో అంజు చనిపోయినట్లేనని పేర్కొన్నారు. ఆమె ఈ పని చేయాలనుకుంటే భర్తకు విడాకులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.