బ్రేకింగ్: కేజ్రీవాల్ ఓటమి... అన్నా హజారే షాకింగ్ కామెంట్స్!
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుంచి వెలువడుతున్నాయి.
By: Tupaki Desk | 8 Feb 2025 12:30 PM ISTదేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ సమయంలో ఓటింగ్ అనంతరం వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో బీజేపీ ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ (36) దాటగా.. కేజ్రీవాల్ ఓటమి పాలవ్వడం గమనార్హం.
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యరు. ఇక్కడ 9వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి సమీప భారతీయ జనతాపార్టీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ 1,200 ఓట్ల ముందంజలో ఉండగా.. ఫైనల్ గా ఆ పోరాటం కంటిన్యూ అయ్యింది.. కేజ్రీవాల్ ని ఓటమి పలకరించింది. ఈ సమయంలో అన్నా హజారే స్పందించారు.
అవును... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార ఆప్ కు వ్యతిరేకంగా వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆధిక్యంలో కమలం పార్టీ దూసుకెళ్తుండగా.. భారీ లీడ్ దిశగా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో.. ప్రముఖ సామాజిక కార్యకర్త, కేజ్రీవాల్ గురువు అన్నా హజారే స్పందిస్తూ.. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓటమి అని అన్నారు.
ఇదే సమయంలో... అధికారంలోకి వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని.. లిక్కర్ స్కాంతో అతడు అప్రతిష్టపాలయ్యారని అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, అందువల్లే కేజ్రీవాల్ ను ప్రజలు ఓడించారని స్పష్టం చేశారు!
ఈ సందర్భంగా... ఒక అభ్యర్థి స్వచ్ఛమైన ప్రవర్తన, స్పష్టమైన ఆలోచనలు, త్యాగ స్ఫూర్తి, నిందారహిత జీవితం కలిగి ఉండాలని తానెల్లప్పుడు చెబుతానని చెప్పిన అన్నా హజారే... ఈ లక్షణాలే ఓటర్ల విశ్వాసాన్ని పొందుతాయని.. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కు తాను సలహాలు, సూచనలు చేసినా అతడు వినలేదని తెలిపారు.
చివరికి మద్యం విధానాలకు అతడు ప్రాధాన్యత ఇచ్చాడని.. డబ్బు, అధికారం అరవింద్ కేజ్రీవాల్ ను తినేశాయని అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 అనే సంగతి తెలిసిందే.