Begin typing your search above and press return to search.

"అన్న క్యాంటిన్లు"... రోజువారీ ఖర్చు ఎంతో తెలుసా?

ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం పునఃప్రారంభమైన 100 అన్న క్యాంటిన్ల రోజు వారీ ఖర్చు అక్షరాలా రూ.78.75 లక్షలు అని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   18 Aug 2024 4:16 AM GMT
అన్న క్యాంటిన్లు... రోజువారీ ఖర్చు ఎంతో తెలుసా?
X

విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారి "అన్న క్యాంటిన్స్" ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తదనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని మూసేసింది. అయితే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటిని తిరిగి ప్రారంభించింది.

ఈ క్రమంలో తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో మొదటి అన్న క్యాంటిన్ ను పునఃప్రారంభించగా.. ఇతర ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిని పునఃప్రారంభించారు. ఈ నేపథ్యంలో హరేరామ ట్రస్ట్ వీటికి ఆహారం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనేది ఓసారి పరిశీలిద్దాం!

అవును... తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో అన్న క్యాంటిన్లు ఒకటనే సంగతి తెలిసిందే. దీంతో.. అధికారంలోకి వచ్చిన అనంతరం వీటి ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం పునఃప్రారంభమైన 100 అన్న క్యాంటిన్ల రోజు వారీ ఖర్చు అక్షరాలా రూ.78.75 లక్షలు అని తెలుస్తుంది. అంటే... నెలకు రూ.19.68 కోట్లన్నమాట.

అంటే... ఏడాదికి రూ.236.25 కోట్లు. ఇక వచ్చే నెలలో ఇప్పటికీ ఉన్న 100 క్యాంటిన్ లకు తోడు మరో 103 క్యాంటీన్లు పెరగనున్నాయని అంటున్నారు. ఈ లెక్కన వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 203 క్యాంటిన్లకు రోజుకి రూ.1.59 కోట్లు.. నెలకు రూ.39.96 కోట్లు.. వెరసి ఏడాదికి రూ.479 కోట్లు ఖర్చు కానుంది.