Begin typing your search above and press return to search.

ఈ ఫైర్‌ బ్రాండ్‌ కు అప్పుడే ఇంత వైరాగ్యమా?

బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ గా పేరు తెచ్చుకున్నవారిలో అన్నామలై ఒకరు.

By:  Tupaki Desk   |   24 July 2024 10:30 AM GMT
ఈ ఫైర్‌ బ్రాండ్‌ కు అప్పుడే ఇంత వైరాగ్యమా?
X

బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ గా పేరు తెచ్చుకున్నవారిలో అన్నామలై ఒకరు. ఈ యువ ఐపీఎస్‌ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతేకాకుండా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన వాగ్దాటితో, కార్యాచరణతో ఆ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేశారు.

ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే 11.24 శాతం ఓట్లు సాధించింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, గతంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేల తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. ఇందులో కీలక పాత్ర అన్నామలైదే. గత మూడేళ్లుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై కొనసాగుతున్నారు.

ఇటీవల ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన అన్నామలై ఓడిపోయారు. 4,50,000 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అయినప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో జయకేతనం ఎగురవేయాలనుకుంటున్న బీజేపీ 40 ఏళ్ల వయసు ఉన్న అన్నామలైపైనే ఆశలు పెట్టుకుంది.

కాగా తాజాగా అన్నామలై కోయంబత్తూరులో పర్యటించారు. ఇటీవల ఎన్నికల్లో తనకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాజకీయాల కంటే తనకు పోలీస్‌ ఉద్యోగమే బెస్ట్‌ అని పలు సందర్భాల్లో అనిపించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒక్కో రోజు ఒక్కో సమస్య ఎదురుకావడంతో రాజకీయాల నుంచి తప్పుకుందామని కూడా అనిపించిందని వెల్లడించారు.

ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాక తాను ఎన్నో నేర్చుకున్నానని అన్నామలై లె లిపారు. ఈ మూడేళ్లలో తాను రాజకీయాల్లో ఉండటం అవసరమా అనే భావన కలిగిందని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

రాజకీయాలకంటే పోలీసు ఉద్యోగమే తనకు నయమనిపించిందని చెప్పారు.

రాజకీయాలలో ఉండేందుకు కొన్ని విషయాల్లో రాజీ కూడా పడ్డానని తెలిపారు.

రాజకీయాల్లో చాలా ఓపిక అవసరమని అన్నామలై చెప్పారు. సాధారణ వ్యక్తి మాదిరిగా వెంటనే కోపాన్ని చూపడానికి ఉండదన్నారు. రాజకీయాల్లో గెలుపు కోసం ఓపికగా ఉండటం కంటే ప్రయత్నం చేస్తూ ఉండటమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో పలు సందర్భాల్లో నిరుత్సాహం, నిరాశ కోపం వచ్చే పరిస్థితి ఎదురయినా కత్తి పట్టి యుద్ధం చేయలేమన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ గా ఉన్న అన్నామలై వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఓటమి బాధలో ఆయన ఈ మాటలు మాట్లాడారా లేక తమిళనాడు బీజేపీ నేతలు, ముఖ్యంగా తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసైతో ఉన్న విభేదాల నేపథ్యంలో మాట్లాడారా అనేది ఆసక్తికరంగా మారింది.