గిద్దలూరు నుంచి పోటీ చేయడంలేదు...ఎమ్మెల్యే అన్నా రాంబాబు...!
వాటిని వైసీపీ కుటుంబ సభ్యులు ఎవరూ నమ్మ వద్దని ఆయన చెప్పారు. తాను తన ప్రయాణం జగనన్నతోనే అంటూ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 27 Dec 2023 11:24 AM GMTతాను అనారోగ్య కారణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గిద్దలూరి వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు. తాను ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నానని అందువల్ల తనకు నాలుగు నెలలు రెస్ట్ కావాలని ఆయన చెపారు. తనకే మళ్లీ టికెట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, తననే పోటీ చేయమని కూడా కోరారని ఆయన తెలిపారు.
అయితే తాను అనారోగ్యం కారణం రిత్యానే తప్పుకుంటున్నానని ఆయన అన్నారు. తాను వేరే పార్టీలోకి వెళ్లడంలేదని ఈ మేరకు వస్తున్న మీడియా ప్రచారం కూడా తప్పు అని ఆయన అన్నారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని ఎవరిని అభ్యర్ధిగా పెట్టినా కూడా గెలిపిస్తానని ఆయన వెల్లడించారు.
నేను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియా,పలు వెబ్ మీడియాల్లో పలువురు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నా రాంబాబు అంటున్నారు. వాటిని వైసీపీ కుటుంబ సభ్యులు ఎవరూ నమ్మ వద్దని ఆయన చెప్పారు. తాను తన ప్రయాణం జగనన్నతోనే అంటూ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు.
తాను 2024లో పోటీ చేయనందుకు ముఖ్యమంత్రి జగన్ కి క్షమాపణ చెబుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే అన్నా రాంబాబు పోటీ నుంచి తప్పుకోవడం వెనక కారణాలు ఏంటి అన్నది చూస్తే ఆయన పనితీరు పట్ల సర్వే నివేదికలు వ్యతిరేకంగా రావడమే అంటున్నారు. దాంతో ఆయన ప్లేస్ లో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు హై కమాండ్ చూస్తోందని కూడా ప్రచారం సాగుతోంది.