Begin typing your search above and press return to search.

రోజుకో మగాడు కావాలి.. లాస్ట్ ఇయర్ స్కోర్ 300.. ఈసారి టార్గెట్ 365!!

ప్రస్తుతం ఈమె చెప్పిన విషయాలు, గతేడాది సాధించిన విజయాలు, ఈ ఏడాది నిర్ధేశించుకున్న లక్ష్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   7 March 2024 10:04 AM GMT
రోజుకో మగాడు కావాలి.. లాస్ట్  ఇయర్  స్కోర్  300.. ఈసారి టార్గెట్ 365!!
X

సాధారణంగా కొత్త ఏడాది వచ్చిందంటే చాలా మంది కొత్త కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకుంటారు. వాటిని కచ్చితంగా సాధించాలని, తద్వారా జీవితంలో మరింత పైకి ఎదగాలని భావిస్తుంటారు. అయితే కొంతమంది వీటిని మిడిల్ డ్రాప్ చేసేస్తుండగా.. కొంతమంది మాత్రం కచ్చితంగా నెరవేరుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ కూడా కొత్త ఏడాది సరికొత్త లక్ష్యాలను పెట్టుకుంది.. అయితే అది కాస్త “డిఫరెంట్” గా!!

జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన అనీ నైట్ అనే మహిళ అన్ని నైట్ లలోనూ సరికొత్త ఆనందాలను పొందాలని కోరుకుంటుందంట. ప్రస్తుతం ఈమె చెప్పిన విషయాలు, గతేడాది సాధించిన విజయాలు, ఈ ఏడాది నిర్ధేశించుకున్న లక్ష్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో భాగంగా గత ఏడాదిలో తాను 300 మంది పురుషులతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఆమె తెలిపింది.

అవును... 2023లో తాను 300 మంది పురుషులతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపిన అన్నీ నైట్... 2024లో అంతకు మించిన లక్ష్యాలని నిద్రేశించుకున్నట్లూ తెలిపింది. అంటే... తన రికార్డును తానే తిరగరాయలనుకుంటుందన్నమాట! ఇదే సమయంలో తన రికార్డును తానే తిరగరాసే దిశగా ఇప్పటికే పని మొదలు పెట్టి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నట్లు చెబుతుంది అన్నీ నైట్. ఇందులో భాగంగా... ఈ ఏడాది అప్పుడే 70 మంది పురుషులతో గడిపినట్లు వెల్లడించింది.

సరాసరిని రోజుకి ఒక పురుషుడిని లెక్కపెట్టినా... ఈ ఏడాది 365 మంది పురుషులతో పడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుండ బద్దలు కొట్టి చెబుతుందట అన్నీ నైట్. ఇలా ఆన్ లైన్ వేదికగా తన లైంగిక జీవితం గురించి ఆమె ఓపెన్ గా మాట్లాడటం ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో... ఈ సందర్భంగా ఆమెకు కొంతమంది నెటిజన్లు “ఆల్ ది బెస్ట్” చెబుతుండగా... మరికొంతమంది మాత్రం “ఆరోగ్యం జాగ్రత్త” అని చెబుతున్నారని తెలుస్తుంది.