Begin typing your search above and press return to search.

ప్రపంచంలో ఇంకో సంక్షోభం.. రెబెల్స్ చేతుల్లోకి మరో దేశం?

దీంతో అఫ్గాన్ తిరుగుబాటుదారులైన తాలిబన్ల వశమైంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 6:30 PM GMT
ప్రపంచంలో ఇంకో సంక్షోభం.. రెబెల్స్ చేతుల్లోకి మరో దేశం?
X

సరిగ్గా మూడేళ్ల కిందట అఫ్ఘానిస్థాన్ లో ప్రజా ప్రభుత్వం కుప్పకూలింది. దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తున్న తాలిబన్లు చివరకు కాబూల్ ను చేజిక్కించుకున్నారు. దీంతో అఫ్గాన్ తిరుగుబాటుదారులైన తాలిబన్ల వశమైంది.

సరిగ్గా రెండేళ్ల కిందట శ్రీలంకలో తిరుగుబాటు జరిగింది. దీనిని ప్రజాగ్రహంగా చూడాలి. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారయ్యారు.

సరిగ్గా గత వారం సిరియా అధ్యక్షుడు అసద్ అల్ బషర్ పై తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు. రోజుల వ్యవధిలోనే రాజధాని డమాస్కస్ కు చేరుకున్నారు. దీంతో బషర్ రష్యా పారిపోయారు.

సరిగ్గా నాలుగు నెలల కిందట బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, షేక్ హసీనా వ్యతిరేక శక్తులు కలగిలిసి ఉద్యమించాయి. దీంతో తీవ్ర హింస చెలరేగింది. హసీనా పారిపోయి ఢిల్లీ వచ్చారు. అయితే, ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..?

యూనస్ తరం కావడం లేదు..

బంగ్లాదేశ్ ను 15 ఏళ్లు పాలించిన హసీనా ఓ స్థితికి తీసుకొచ్చారు. అయితే, ఆర్థిక నోబెల్ గ్రహీత అయిన మొహమ్మద్ యూనస్ మాత్రం దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం బంగ్లా బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందట. విద్యుత్తు సరఫరా లేక పరిశ్రమలు కుప్పకూలేలా ఉన్నాయట.

ఇక్కడా తిరుగుబాటుదారులు.

బంగ్లాదేశ్ కు పొరుగునున్న మయన్మార్ తో పొసగదు. మయన్మార్ తమ దేశం నుంచి రోహింగ్యా ముస్లింలను వెళ్లగొట్టింది. లక్షలాది రోహింగ్యాలు బంగ్లాకు వచ్చారు. అయితే, ఇప్పుడు బంగ్లా సరిహద్దులు సంక్షోభంలో పడ్డాయట. మయన్మార్ రెబల్స్ 275 కిలోమీటర్ల మేర బంగ్లా సరిహద్దును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనస్ ప్రభుత్వం అక్కడ వాణిజ్య సేవలను నిలిపివేసిందట. బంగ్లాదేశ్ లోని టెక్నాఫ్ సహా కొన్ని ప్రాంతాలను మయన్మార్ తిరుగుబాటుదారులు ఆక్రమించినట్లు సమాచారం. ఇది ఎక్కడకు దారితీస్తుందో చూడాలి మరి.