Begin typing your search above and press return to search.

వికెట్ నెంబర్ 7... బీఆరెస్స్ కు మరో ఎమ్మెల్యే షాక్!

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష సక్సెస్ ఫుల్ గా నడుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 July 2024 7:10 AM GMT
వికెట్  నెంబర్ 7... బీఆరెస్స్  కు మరో ఎమ్మెల్యే షాక్!
X

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష సక్సెస్ ఫుల్ గా నడుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫలితంగా బీఆరెస్స్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం అందుకున్న నేపథ్యంలో.. మరో ఎమ్మెల్యే కూడా తాను రెడీగా ఉన్నట్లు ప్రకటించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగిపోయిన సంగతి తెలిసిందే. మరోపక్క రాత్రికి రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తాన్ని అందుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాను కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు మరో బీఆరెస్స్ ఎమ్మెల్యే ప్రకటించడం ఇప్పుడు వైరల్ గా మారింది. మరోపక్క ఈయన పార్టీ మారితే దూకేస్తానంటూ ఓ కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు!

తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఆయనకు అటు నుంచి లైన్ క్లియర్ అయ్యిందని చెబుతున్నారు. దీంతో... తాను పార్టీ మారబోతున్నట్లు అనుచరుల భేటీలో వెల్లడించారు బీఆరెస్స్ ఎమ్మెల్యే. మరోపక్క ఆయన కాంగ్రెస్ లో చేరిక విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య... కాంగ్రెస్ లోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు స్థానిక నేతలూ సరితకు వంతపాడుతున్నారని అంటున్నారు. మరోపక్క సరిత అనుచరులు సెల్ టవర్ ఎక్కి దూకేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంటరయ్యారు. ఇందులో భాగంగా సరిత తిరుపతయ్యతో భేటీ అయ్యి... కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరినప్పటీకీ... మీకు సముచిత స్థానం ఇస్తామని భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇలా రేవంత్ నచ్చచెప్పడంతో కాంగ్రెస్ లోకి కృష్ణమోహన్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యిందని.. ఇక కండువా కప్పుకోవడమే తరువాయని అంటున్నారు.

సెల్ టవర్ ఎక్కిన అభిమాని!:

గద్వాల్ ఎమ్మెల్యే, బీఆరెస్స్ నేత కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అభిమాని ప్రసాద్ (25) ఏకంగా సెల్ టవర్ ఎక్కి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. కృష్ణమోహన్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే.. తాను టవర్ పై నుంచి దూకేస్తానని బెదిరించాడు. అనంతరం అతడిని పోలీసులు వచ్చి నచ్చచెప్పి దింపారు!