మరో ఫేక్ సివిల్ సర్వెంట్!... పేరెంట్స్ నే చీట్ చేసింది!
ఈ తతంగం సుమారు రెండేళ్లుగా నడుస్తుంది. అయితే తాజాగా ఈ వ్యవహారం అంతా అబద్ధం అని తేలింది. ఆ జ్యోతి వేరు, ఈ జ్యోతి వేరని క్లారిటీ వచ్చింది.
By: Tupaki Desk | 19 July 2024 3:23 AM GMTగత కొన్ని రోజులుగా పూణేలోని ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ రిపోర్ట్లు అంటూ ఈమె వ్యవహారం వైరల్ గా మారింది. ఆమెపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా జ్యోతి మిశ్రా అనే ఆమె వ్యవహారం తెరపైకి వచ్చింది.
అవును... చాలా మంది చదువుకుంటున్న పిల్లలను... నువ్వు పెద్దాయ్యక ఏమవుతావని అడిగితే... చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అని సమాధానం చెబుతుంటారు. అందులో అతి కొద్ది మంది ఆ కలను నెరవేర్చుకుంటారు.. మరికొంతమంది రాజీ పడిపోతుంటారు! మరికొన్ని పరిస్థితుల కారణంగా ప్రత్యామ్న్యాయాలు చూసుకుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన జ్యోతి వ్యవహారం డిఫరెంట్!!
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... యూపీలోని పోలీస్ సబ్ ఇనిస్పెక్టర్ గా పనిచేస్తున్న సురేష్ నారాయణ్ మిశ్రా పెద్ద కుమార్తె జ్యోతి చిన్నప్పటి నుంచీ చదువులో బాగా యాక్టివ్ గా ఉండేది. ఆమె పన్నెండో తరగతిలో 96% స్కోర్ చేసింది. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ లోనూ బాగా రాణించింది. ఈ నేపథ్యంలో.. మరో అమ్మాయి యూపీఎస్సీ ఫలితాన్ని నకిలీ చేసింది.
ఇందులో భాగంగా తాను యూపీఎస్సీ సక్సెస్ ఫుల్ గా క్రాక్ చేసినట్లు తన తల్లితండ్రులను నమ్మించింది. ప్రస్తుతం స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ వచ్చింది. ఈ తతంగం సుమారు రెండేళ్లుగా నడుస్తుంది. అయితే తాజాగా ఈ వ్యవహారం అంతా అబద్ధం అని తేలింది. ఆ జ్యోతి వేరు, ఈ జ్యోతి వేరని క్లారిటీ వచ్చింది.
ఇందులో భాగంగా ఆమె ఐ.ఎఫ్.ఎస్. అధికారి కాదని, ఆమె మాడ్రీడ్ లోని ఇండియన్ ఎంబసీ లో పనిచేయడం లేదని, ఆమె యూపీఎస్సీని క్లియర్ చేయలేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె బ్రాహ్మణురాలిగా ఉన్నప్పటికీ... ఎస్సీ సామాజికవర్గానికి చెందినట్లుగా క్లెయిం చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ విషయాలపై జ్యోతి మిశ్రా తల్లితండ్రులు స్పందించారు. ఇందులో భాగంగా... అసలు ఆమె తమతో ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో అర్ధం కావడం లేదని అన్నారు. సివిల్స్ సాధించాలని తాము ఎప్పుడూ ఆమెపై ఒత్తిడి తీసుకురాలేదని చెబుతున్నారు. ఆమె ఇంటికి తిరిగిరావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే జ్యోతి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తప్పు ఒప్పుకుందని తెలుస్తోంది!