మధు యాష్కీ మరో రికార్డు... అంత ఈజీగా కనిపించట్లే
తాను కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తగా ఉన్నానని, తనను కాదని మధుయాస్కీకి టికెట్ ఖరారు చేయడంపై జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు.
By: Tupaki Desk | 30 Oct 2023 4:23 AM GMTతెలంగాణ కాంగ్రెస్ ఊహించని రీతిలో బలపడుతోందని, బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందనే వార్తల్లో ఎంత నిజం ఉందో... ఆ పార్టీ అంతర్గత పరిణామాలతో అంతే కుదేలు అవుతోందన్నది కూడా అంతే నిజం. టికెట్ల ఖరారుకు ముందు ఒక రకమైన సమస్య ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పేర్లు ఖరారయ్యాక మరో రకమైన సమస్యను రుచి చూస్తోంది. అలాంటి ఇబ్బందికర నియోజకవర్గాల్లో హైదరాబాద్‌లోని కీలకమైన ఎల్బీనగర్ నియోజకవర్గం ఒకటి. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఊహించినట్లే ఇక్కడి నుంచి బరిలో దిగుతుండగా ఆయనకు స్థానిక నేతలు చుక్కలు చూపిస్తున్నారు.
లో ప్యారాచూట్ నేత మధుయాస్కీగౌడ్‌కు అధిష్ఠానం టికెట్ ఖరారు చేసిందని ఆరోపిస్తూ ఇప్పటి వరకు టికెట్ తమకే వస్తుందనే ఆశలో ఉన్న వారంతా నిరాశలో ఉన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రాంమోహన్‌గౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. టికెట్ ఆశించిన మల్‌రెడ్డి రాంరెడ్డి, జెక్కిడి ప్రభాకర్‌రెడ్డి తదితరులు భంగపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తగా ఉన్నానని, తనను కాదని మధుయాస్కీకి టికెట్ ఖరారు చేయడంపై జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమంటూ సహచరులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు తెలిసింది.
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ సంపాదించుకున్న మధుయాష్కీగౌడ్‌కు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి.
ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ముఖ్య నేతలంతా ఆయనకు దూరం జరిగారు. టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన మధుయాష్కీకి వారంతా ముఖం చాటేశారు. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రాంమోహన్‌గౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. టికెట్ ఆశించిన మల్‌రెడ్డి రాంరెడ్డి, జెక్కిడి ప్రభాకర్‌రెడ్డి తదితరులు భంగపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తగా ఉన్నానని, తనను కాదని మధుయాస్కీకి టికెట్ ఖరారు చేయడంపై జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమంటూ సహచరులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు తెలిసింది.
మరోవైపు ఎల్బీ నగర్ టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన మధుయాష్కీకి వారంతా ముఖం చాటేశారు. శనివారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో మధుయాష్కీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుల్లో ఒక్క లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి మాత్రమే హాజరవగా, మిగతా నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. మధుయాష్కీకి దూరం జరిగిన ముఖ్య నేతల కారణంగా ఆయన గెలుపు ప్రభావితం కానుందని అంటున్నారు. ఎన్నారైగా పేరు సంపాదించి భారత్‌కు తిరిగి వచ్చి ఎంపీ అయి ప్రత్యేకతను చాటుకున్న మధు యాష్కీ ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం అంత సులభమైన విషయమేమీ కాదని అంటున్నారు.