Begin typing your search above and press return to search.

స్కిల్ స్కాం లో సంచలనం : చంద్రబాబు మాజీ పీఏ సస్పెన్షన్ !

స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో స్కాం జరిగిందని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ కేసుని రెండేళ్ళుగా విచారిస్తోంది.

By:  Tupaki Desk   |   30 Sep 2023 8:28 AM GMT
స్కిల్ స్కాం లో సంచలనం : చంద్రబాబు మాజీ  పీఏ సస్పెన్షన్ !
X

స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో స్కాం జరిగిందని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ కేసుని రెండేళ్ళుగా విచారిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ కేసులో ప్రమేయం ఉందని పేర్కొంటూ ఆయన్ని సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్ట్ చేసింది. ఆ మరుసటి రోజు ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలకంగా భావిస్తున్నా చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్ళినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. ఆయన్ని వెనక్కి రమ్మని ప్రభుత్వ అధికారులు ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా తిరిగి రాకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు కఠినమైన నిర్ణయం తీసుకుంది. సర్వీస్ నిబంధనలను అతిక్రమించారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ రొజు ఉత్తర్వులు జారీ చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో పెండ్యాల శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు డబ్బులు అందాయని సీఐడీ ఆరోపిస్తోంది. అంతే కాదు చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో కూడా శ్రీనివాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది. పెండ్యాల శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉంటున్నారు.

ఇదిలా ఉంటే ఆయన సెప్టెంబర్ 11 నుంచి తనకు లీవ్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ఎపుడైతే స్కిల్ కేసు బయటకు వచ్చిందో ఆయన ఈ నెల 6న అమెరికా వెళ్లిపోయారని అంటున్నారు. అయితే శ్రీనివాస్ అమెరికా పర్యటన గురించి ఉన్నతాధికారులకు ఎక్కడా తెలియచేయలేదని నటున్నారు.

అలా అనుమతి ఏదీ తీసుకోకుండా ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళడం నిబంధలనకు విరుద్ధం అని అంటున్నారు. ఏ అధికారి అయినా విదేశీ పర్యటన చేయాలని అనుకుంటే దాన్ని ముందుగా ఉన్నతాధికారులకు తెలియచేయాల్సి ఉంటుంది. అలా నిబంధనలను ధిక్కరించి మరీ శ్రీనివాస్ సొంతంగా అమెరికా టూర్ పెట్టుకోవడంతో మొదట ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆయనకు మెమో ఒకటి జారీ చేసింది.

అమెరికా టూర్ పై వారంలోనే వెనక్కి వచ్చి సంజాయషీ ఇవ్వాలని కూడా అందులో పేర్కొంది. అయింతే పెండ్యాల శ్రీనివాస్ ఈ మెమోని సైతం ఖాతరు చేయకపోవడంతో ఆయన మీద ఇపుడు సీరియస్ యాక్షన్ కి దిగిపోయారు. దీంతో ఆయనను సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు.

మొత్తం మీద చూస్తూంటే పెండ్యాల శ్రీనివాస్ ఇప్పటప్పట్లో వచ్చే అవకాశాలు లేవు అని నిర్ధారించుకున్న మీదటనే ఆయనను సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటున్నారు. దాంతో రానున్న రోజుల్లో మరిన్ని కఠిన చర్యల దిశగా ప్రభుత్వం వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంది. అంతే కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కాం విషయంలో ఇంకా చాలా మంది మీద కేసులు పడనున్నాయని అంటున్నారు.