సల్మాన్ కేసులో నిందితుడు ఆత్మహత్య!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పులకు కారణమైన అనూజ్ తపన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By: Tupaki Desk | 1 May 2024 11:13 AM GMTబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పులకు కారణమైన అనూజ్ తపన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు లాకప్ లో ఉన్న అతను ఈ ఉదయం బాత్రూమ్ కి వెళ్లి బెడ్ షీట్ తో ఉరేసుకుని హత్మహత్యకు యత్నించాడు. అది గమనించిన అధికారులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇప్పుడీ వార్త సంచలనంగా మారింద. అనూజ్ ఏ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తోటి ఖైదీలను విచారిస్తున్నారు.
ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కొంత మంది దుండగులు కాల్పులు జరిపిన సంగతి దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఘటన అనంతరం దుండగులు బైక్ పై వెళ్తోన్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పుటేజ్ ఆధారంగా విక్కీ...గుప్తా.. సాగర్ పాల్ ని అరెస్ట్చేసారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫారా చేశారన్న ఆరోపణలపై అనూజ్ తపన్.. సోను సుభాష్ చందర్ లను అదుపులోకి తీసుకున్నారు.
వీరిని సోమవారం కోర్టులో హాజరు పరచగా సోనూ మినహా మిగతా ముగ్గురికీ న్యాయస్థానం పోలీస్ కస్టడీ విధించింది. అనారోగ్యం కారణంగా సోనూను కస్టడీకి ఇవ్వాలని కోరలేదు. ఈనలుగురు నిందితులు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులని పోలీసులు తెలిపారు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సల్మాన్కి ఆ ఆగ్యాంగ్ నుంచి బెదిరింపులు కొత్తేం కాదు.
చాలా కాలంగా వివిధ రూపాల్లో బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. దీంతో సల్మాన్ కి ప్రభుత్వం వైప్లస్ భద్రత కల్పిస్తుంది. ఇంకా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఉంది. ఆయన ఎక్కడకు వెళ్లినా చుట్టూ గన్ మెన్లు ఉటారు. ఎక్కడికి ప్రయాణం చేసినా బుల్లెట్ ప్రూప్ కారు లోనే చేస్తుంటారు.