Begin typing your search above and press return to search.

ఏపీ ఎయిర్ పోర్టులకు పూర్వవైభవం... తాజా ర్యాంకుల వివరాలివే!

ఇదే సమయంలో... విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2,75,694 మంది ప్రయాణికులను నిర్వహించడంతో 25.7 శాత పెరుగుదలను సూచిస్తూ.. 26వ ర్యాంక్ ను పొందింది.

By:  Tupaki Desk   |   31 Jan 2025 5:29 AM GMT
ఏపీ ఎయిర్  పోర్టులకు పూర్వవైభవం...  తాజా ర్యాంకుల వివరాలివే!
X

ఆంధ్రప్రదేశ్ లోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ తిరిగి ఊపందుకుంటోంది! ప్రధానంగా వైసీపీ పాలనలో ఇవి కాస్త వైభవం కోల్పోయినట్లు చెబుతుండగా.. గడిచిన ఆరు నెలలుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ, విశాఖ విమానాశ్రయాలతో పాటు తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలకూ పూర్వ వైభవం వస్తోందని తెలుస్తోంది.

అవును... ఏపీలోని ఎయిర్ పోర్టులకు పూర్వవైభవం వస్తోందని అంటున్నారు. గత ఐదేళ్ల విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వైభవం కోల్పోగా.. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వత తిరిగి మిలియన్ మార్క్ ను అందుకుందని చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - డిసెంబర్ చివరకు 9,99,555 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించారు!

2024 డిసెంబర్ లోనే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,40,625 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు చెబుతున్నారు. 2023లో అదే సమయంలో పోలిస్తే ఇది 47% పెరుగుదల అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయంగా అవతరించిన విజయవాడ ఎయిర్ పోర్టు 35వ ర్యాంక్ పొందింది.

ఇదే సమయంలో... విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2,75,694 మంది ప్రయాణికులను నిర్వహించడంతో 25.7 శాత పెరుగుదలను సూచిస్తూ.. 26వ ర్యాంక్ ను పొందింది. ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా చెప్పే వైజాగ్ కు ఉన్న అన్ని రకాల అవకాశాలు, సదుపాయలా మేర ఏపీలో అన్ని విమానాశ్రయాలకంటే మెరుగైన స్థితిలో నిలిచింది.

ఇక రాజమండ్రి, తిరుపతి దేశీయ విమానాశ్రయాల విషయానికొస్తే గతేడాది డిసెంబర్ లో ఈ ఎయిర్ పోర్టులలోనూ రద్దీ పెరిగింది. ఈ సమయంలో 2024 డిసెంబర్ లో 51,332 మంది ప్రయాణికులకు విమాన సర్వీసులను అందించిన రాజమండ్రి 53వ ర్యాంక్ పొందగా.. 1,02,739 ప్రయాణికులతో తిరుపతి విమానాశ్రయం 45వ ర్యాంకును పొందింది.

కాగా... ప్యాసింజర్, కార్గో హ్యాండ్లింగ్ లో పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని విమానాశ్రయాలు ర్యాంక్ చేయబడ్డాయి. ఈ సమయంలో ఏపీలో వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు 26వ ర్యాంక్, విజయవాడ విమానాశ్రయానికి 35వ ర్యాంక్ దగ్గరగా... తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలకు వరుసగా 45, 53వ ర్యాంక్స్ దక్కాయి.