Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్... అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యే వర్సెస్ డిపూటీ స్పీకర్!

దీనికి మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అనంతరం రవికుమార్ మరోసారి ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   7 March 2025 3:28 PM IST
ఇంట్రస్టింగ్... అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యే వర్సెస్  డిపూటీ స్పీకర్!
X

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... విశాఖలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ విషయంలో అధికారులు ఇష్టారీతిన దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అనంతరం రవికుమార్ మరోసారి ప్రశ్నించారు.

తాను అడిగిన ప్రశ్నకు సమాధనాం రాలేదని.. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల లబ్ధిదారులు 20 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పటిలోగా న్యాయం చేస్తుందో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు.

ఈ సందర్భంగా... కార్పొరేషన్ వాళ్లు బ్యాంక్ నుంచి రూ.1000 కోట్లు అప్పు తీసుకొచ్చారని.. అయితే ఆ డబ్బు ఎక్కడుంది.. ఏమి చేశారు? అని అడిగారు. అనంతరం.. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహలోని 10 ప్రాజెక్టులకు కలిపి కేటాయించింది మొత్తం 570 ఎకరాలని.. వీటిలో ప్లాట్లు వేసింది 8,500 అని తెలిపారు. ఈ సందర్భంగా పూర్తై అమ్మకుండా ఉన్న ప్లాట్లు 9 ఉన్నాయని అన్నారు!

ఇదే సమయంలో... సెమీ ఫినిష్డ్ 1105 అందుబాటులో ఉన్నాయని.. అమ్మినవి 160, మిగిలినవి 940 అని అన్నారు. ఈ సందర్భంగా... సుమారు 20 ఏళ్లుగా ఈ ప్లాట్స్ ని ఎందుకు అమ్మలేకపోతున్నారో చెప్పాలని కూన రవికుమార్ అడిగారు. రాజీవ్ స్వగృహలో పనిచేస్తున్న 70 మంది ఉద్యోగులకు ఇది కల్పతరువని కామెంట్ చేశారు.

అక్కడున్న అధికారులకు, ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా కారు ఉంటుంది, ఇతర సౌకర్యాలు ఉంటాయని తెలిపారు! ఈ సమయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. మీరు అడిగిన లెక్కలు ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యం కాదని.. మీరు అడిగినవాటికి లిఖిత పూర్వక సమాధానం ఇస్తారని తెలిపారు.

నాకు ఇప్పుడే చెప్పాలి ఇప్పుడే చెప్పాలి అని అడిగితే అది సాధ్యం కాదని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. అయితే.. తాను నిన్నటి విషయం గురించి నేడు లెక్కలు అడగడం లేదని.. సుమారు 20 సంవత్సరాల నాటి విషయం గురించి అడుగుతున్నానని.. వినియోగదారులకు కాంపన్సేషన్ అయినా చెల్లిస్తారా అని మంత్రిని అడుగుతున్నట్లు తెలిపారు రవికుమార్.

ఈ సందర్భంగా స్పందించిన డిప్యూటీ స్పీకర్... ఈ విషయంపై మంత్రి (నారాయణ) నోట్ చేసుకోవడం తాను చూశానని.. మీకు సమాధానం వస్తుందని.. అంచేత కాస్త వెయిట్ చేయాలని.. అంత అసహనం వద్దని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు సూచించారు. అనంతరం మరో ఎమ్మెల్యేని మాట్లాడాలని తెలిపారు!!

దీంతో... ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.