Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క లక్కీ చాన్స్...ఏపీ బీజేపీ నేతల ఆశలు!

ఏపీ బీజేపీ నేతలు పదవుల కోసం చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఉంది.

By:  Tupaki Desk   |   8 Feb 2025 4:06 AM
ఒకే ఒక్క లక్కీ చాన్స్...ఏపీ బీజేపీ నేతల ఆశలు!
X

ఏపీ బీజేపీ నేతలు పదవుల కోసం చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఉంది. నాలుగేళ్ళకు పైగా అధికారం చేతిలో ఉంది. దాంతో పదవులు ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా కమలనాధులు చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

నామినేటెడ్ పదవుల విషయంలోనూ తక్కువ వచ్చాయన్న ఆవేదన ఉంది. ఇపుడు ఎమ్మెల్సీ పదవుల విషయంలో బీజేపీ నేతలు సరికొత్త ఆశలు పెంచుకుంటున్నారు అని తెలుస్తోంది. ఈ మార్చిలో నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవబోతున్నాయి. అందులో కచ్చితంగా ఒకటి అయితే బీజేపీకి ఇస్తారని అంటున్నారు.

గతంలోనూ బీజేపీకి ఒక ఎమ్మెల్సీ పదవిని 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇచ్చింది. అలా సోము వీర్రాజు ఆరేళ్ళ పాటు ఎమ్మెల్సీగా పనిచేశారు ఈసారి కూడా ఒకరికి చాన్స్ దక్కే సూచనలు మెండుగా ఉన్నాయట. ఈ ఒకే ఒక్క సీటు కోసం పోటీ మాత్రం టాప్ లోనే ఉందని అంటున్నారు.

ప్రాంతాల వారీగా సామాజిక వర్గాల వారీగా సీనియర్లు జూనియర్లు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు తమ వంతుగా చేస్తున్నారు అని అంటున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నామని తమకు పదవి దక్కదా అని కేంద్ర స్థాయి పెద్దల వద్దకే వెళ్ళి కొందరు ప్రయత్నాలు చేసుకుంటున్నారుట. ఇక బలమైన సామాజిక వర్గాలకు పదవి ఇస్తే రాజకీయంగా మేలు జరుగుతుందని అధినాయకత్వం చూస్తోంది అని టాక్.

అంతే కాదు పార్టీ కోసం పనిచేసిన వారికి విధేయులకు మరీ ముఖ్యంగా కొత్త వారికి పదవులు ఇస్తే మేలు అన్న తీరున ఆలోచిస్తోంది అని అంటున్నారు. గతంలో ఒకసారి పదవులు పొందిన వారిని పక్కన పెట్టాలని కూడా చూస్తున్నారుట.

అయితే సీనియర్లు మాత్రం పట్టు విడవకుండా ప్రయంత్నాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవిని దక్కించుకుంటే లక్ కలసి వస్తే ఏకంగా కేబినెట్ బెర్త్ ని కూడా దక్కించుకోవచ్చు అన్న ఆశలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఏపీ కేబినెట్ లో బీజేపీకి ఒక మంత్రి పదవే దక్కింది. దాంతో ఎండవ బెర్త్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీగా ఉంటే మినిస్టర్ రేసులోనూ దూసుకుపోవచ్చు అని కొంతమంది ఆశావహులు చూస్తున్నారుట.

ఇవన్నీ పక్కన పెడితే ఈసారి బీసీల నుంచి ఎమ్మెల్సీని ఎంపిక చేయాలని పార్టీ చూస్తోంది అని అంటున్నారు. దాంతో ఆ సామాజిక వర్గం నుంచి కూడా పోటీ ఎక్కువగా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి ఇచ్చేది ఒకే ఒక్క ఎమ్మెల్సీ అయితే దాని కోసం ఎంతో మంది పోటీ పడడం జరుగుతోందని అంటున్నారు. అయితే హై కమాండ్ మాటే ఫైనల్. కాబట్టి పార్టీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికి ఆ లక్కీ చాన్స్ దక్కుతుందో చూడాల్సిందే అంటున్నారు.