Begin typing your search above and press return to search.

కూటమి బడ్జెట్ లో ఇవి మిస్ !

ఏపీలో మూడు లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్ ని టీడీపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 12:54 PM GMT
కూటమి బడ్జెట్ లో ఇవి మిస్ !
X

ఏపీలో మూడు లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్ ని టీడీపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో అనేక అంశాలు ప్రస్తావించారు. అలాగే సూపర్ సిక్స్ హామీలను గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ బడ్జెట్ లో టీడీపీ కూటమి ఎన్నికల్లో పేర్కొన్న హామీలు అన్నీ అమలు చేసారా అంటే లేదనే జవాబు వస్తోంది. అవన్నీ పూర్తి స్థాయి కూటమి బడ్జెట్ లో మిస్ అయ్యాయని అంటున్నారు. నిజానికి చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏకంగా భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. మరి ఈ బడ్జెట్ లో హామీలు అన్నీ నెరవేరినట్లేనా అంటే లేదు అనే జవాబు వస్తుంది.

ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు హామీ అన్నది ఈ బడ్జెట్ లో లేకుండా పోయింది. ఈ పధకం కూడా కూటమిని అధికారంలోకి తీసుకుని రావడానికి ఉపయోగపడింది. 2023 లో రాజమండ్రిలో జరిగిన మహానాడులో బాబు తొలిగా ఇచ్చిన హామీలలో ఇది ఒకటి. తెలంగాణా కర్ణాటకలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తూనే అమలు చేసిన హామీ ఇది.

పైగా ఏపీ ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా అధ్యయనం చేస్తున్నామని చెబుతూ వచ్చింది. ఒక ఏడాది ముగిసినా ఈ పధకం అమలు చేస్తారని అనుకున్నారు. కానీ బడ్జెట్ లో చూస్తే ఆ హామీ మిస్ అయింది అని అంటున్నారు. ఈ పధకం అమలుకు నెలకు నాలుగు నుంచి అయిదు వందల కోట్ల రూపాయలు అవుతుంది. ఏడాదికి ఆరు వేల కోట్లు. అందుకే దీనిని అలా వదిలేశారా అన్న చర్చ వస్తోంది.

మరో వైపు చూస్తే నిరుద్యోగ భృతి అన్నది కూటమి ఇచ్చిన భారీ హామీ. ఏపీలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేంతవరకూ నెలకు మూడు వేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక ఆ ఊసే ఎక్కడా లేదు. ఇపుడు దీనినే ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి.

ఇంకో వైపు చూస్తే 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలకు నెకలు 1500 వంతున ఏడాదికి 18 వేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అది తొలి ఏడాది నెరవేరలేదు. కొత్త ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో సైతం ఆ ప్రస్తావన లేకుండా పోయింది అని అంటున్నారు.

బీసీలకు యాభై ఏళ్ళు వస్తే చాలు నెలవారీ పెన్షన్లు అమలు చేస్తామని టీడీపీ కూటమి పెద్దలు ఎన్నికల్లో చెబుతూ వచ్చారు. ఇపుడు తొమ్మిది నెలల ప్రభుత్వంలో ఎక్కడా ఆ మాట లేదు. బడ్జెట్ లో చూస్తే ఆ ప్రస్తావన అన్నది లేదు అని అంటున్నారు. దాంతో ఈ బడ్జెట్ లో చాలా హామీలు అయితే మిస్ అయ్యాయని ఇక నిధులు కేటాయించిన రెండు కీలక పధకాలకు కూడా సరిపడా కేటాయింపులు లేవని అంటున్నారు. మరి దీని మీద కూటమి పెద్దలు ఏ విధంగా జవాబు చెబుతారో చూడాల్సి ఉంది.