మంత్రులకు ర్యాంకులు: ఆరో స్థానంలో చంద్రబాబు.. పవన్ స్థానం?
ఇక ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 6 Feb 2025 1:57 PM GMTఏపీ సచివాలయంలో నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అత్యంత కీలకమైన ఈ సమావేశానికి అనారోగ్య కారణాల దృష్ట్యా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేకపోయారు. ఇక ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
అవును... తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మంత్రుల పనితీరుపై ర్యాంకుల ప్రకటన అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. గత ఏడాది డిసెంబర్ వరకూ ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా తాను 6వ స్థానంలో ఉన్నట్లు చెప్పిన చంద్రబాబు.. ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు. ఈ సందర్భంగా డిసెంబర్ వరకూ జరిగిన ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఈ జాబితాలో మంత్రి ఫరూఖ్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
వాస్తవానికి మంత్రుల పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలని చంద్రబాబు ఎప్పటికప్పుడు మంత్రులను ఆదేశిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో.. క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా కూడా పలువురి పెర్ఫార్మెన్స్ పై క్లాసులు కూడా ఉంటాయని.. మెరుగుపరుచుకోకపోతే ఉపేక్షించేది లేదనే హెచ్చరికలు ఉన్న సందర్భాలున్నాయని అంటారు.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. ఈ జాబితాలో మంత్రి ఫరూఖ్ మొదటి స్థానంలో ఉండగా.. వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో నిలిచారు. గతంలో చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి మరీ వాసంశెట్టి పెర్ఫార్మెన్స్ పై కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారనే చర్చ నడిచిన సంగతి తెలిసిందే.
ఇక ఈ జాబితాలో అత్యంత ఆసక్తికరంగా చంద్రబాబు నాయుడు 6వ స్థానంలో నిలవగా, మంత్రి నారా లోకేష్ 8 స్థానంలో నిలిచారు. ఇక తొలిసారి మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజా మంత్రుల ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో నిలవడం గమనార్హం.
ఇదే సమయంలో పయ్యావుల కేశవ్, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు చివరి నుంచి వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక అచ్చెన్నాయుడు 17వ స్థానానికి పరిమితం కాగా.. హోంమంత్రి వంగలపూడి అనిత 20వ స్థానంలో, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ 21వ స్థానంలో నిలిచారు.
ఏపీ మంత్రుల ర్యాంకింగ్స్:
1. ఫరూఖ్
2. కందుల దుర్గేష్
3. కొండపల్లి శ్రీనివాస్
4. నాదేండ్ల మనోహర్
5. డొలా బాలవీరాంజనేయ స్వామి
6. చంద్రబాబు నాయుడు
7. సత్యకుమార్ యాదవ్
8. నారా లోకేష్
9. బీసీ జనార్ధన్ రెడ్డి
10. పవన్ కల్యాణ్
11. సవిత
12. కొలు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమర్
14. నారాయణ
15. టీజీ భారత్
16. ఆనం రామనారాయణరెడ్డి
17. అచ్చెన్నాయుడు
18. రాంప్రసాద్ రెడ్డి
19. గుమ్మడి సంధ్యారాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్
22. నిమ్మల రామనాయుడు
23. కొలుసు పార్థసారధి
24. పయ్యవుల కేశవ్
25. వాసంశెట్టి సుభాష్