అమరావతి: మళ్లీ ప్రధానే ..!
తాజాగా ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు మోడీని ఏపీకి ఆహ్వానించనున్నారు. ఆయన రాకను బట్టి.. పనుల కు ముహూర్తం పెట్టనున్నట్టు తెలిసింది.
By: Tupaki Desk | 20 March 2025 4:30 AM ISTఏపీ రాజధాని అమరావతిలో పనులు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఈ దఫా 40 వేల కోట్ల సొమ్ములతో పనులు ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిలో ప్రధానంగా మంత్రులు, న్యా యమూర్తుల నివాసాలు, మౌలిక సదుపాయాలు, హైకోర్టు నిర్మాణం వంటివి ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు. వీటిని ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 12, 13 తేదీల్లోనే పనులు ప్రారంభించాలని అనుకున్నారు.
ఆ వెంటనే పనులు కూడా మొదలవుతాయని గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు వెల్లడించారు. అయితే.. ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి కారణం.. పునః ప్రారంభ పనులను ప్రధాని నరేంద్ర మోడీతో ప్రారంభించాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి 30 వేల కోట్ల వరకు అప్పులు ఇస్తున్న నేపథ్యంలో మోడీకి పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే టెండర్లను కూడా ఖరారు చేయకుండా ఉంచారన్న చర్చ ఉంది.
తాజాగా ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు మోడీని ఏపీకి ఆహ్వానించనున్నారు. ఆయన రాకను బట్టి.. పనులకు ముహూర్తం పెట్టనున్నట్టు తెలిసింది. మరోవైపు... మోడీ రాకపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. గతంలో రాజధానిని కూడా ఆయన చేత్తోనే ప్రారంభించారని, అప్పట్లో నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం అటక ఎక్కించినా.. ఆయన ఏమీ స్పందించలేదని, కనీసం పదేళ్లలో రాజధాని గురించి కేం ద్రం స్థాయిలో రివ్యూ కూడా చేయలేదని.. ఇప్పుడు ఆయనను ఎందుకు పిలుస్తున్నారన్నది సీనియర్‌ల వాదన.
కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉందని సీనియర్లు చెబుతున్నారు. గతంలో ఉన్న బాండింగ్ వేరు.. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు టీడీపీ కీలకంగా మారిందని.. ఈ నేపథ్యంలో ఇప్పుడు న్న బాండింగ్ వేరని వారు చెబుతున్నారు. పైగా.. ఇప్పుడు కేంద్రాన్ని మచ్చిక చేసుకోవడం ద్వారా అమరావ తిని ఈ దఫా పాలనలోనే పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా.. మోడీని పిలవడమే బెటర్ అని వారు చెబుతున్నారు. మొత్తానికి త్వరలోనే అమరావతిలో మోడీ మరోసారి పునః ప్రారంభ కార్యక్రమాలకు పూజలు, శంకుస్థాపనలు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.