Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ని ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు!

ఈ సందర్భంగా సాక్ష్యత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి అల్లు అర్జున్ ని పరామర్శించడం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   14 Dec 2024 2:00 PM GMT
అల్లు అర్జున్  ని ఫోన్  లో పరామర్శించిన చంద్రబాబు!
X

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాకయ్యిందనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో శనివారం విడుదలైన అనంతరం పలువురు సినీ ప్రముఖులు బన్నీని పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అల్లు అర్జున్ ని పరామర్శించారు!

అవును.. అల్లు అర్జున్ శుక్రవారం మధ్యాహ్నం అరెస్టవ్వడం.. అదే రోజు సాయంత్రం బెయిల్ వచ్చినా కొన్ని కారణాల వల్ల రాత్రి చంచల్ గూడ జైలులోనే ఉండటం తెలిసిందే. దీంతో... శనివారం ఉదయం విడుదలై ఇంటికి వచ్చారు. ఈ సమయంలో శనివారం సాయంత్రం అల్లు అర్జున్ కు చంద్రబాబు ఫోన్ చేశారు.

జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా సాక్ష్యత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి అల్లు అర్జున్ ని పరామర్శించడం హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు... అల్లు అర్జున్ విడుదలైన తర్వాత.. ఆర్. నారాయణమూర్తి, కే. రాఘవేంద్ర రావు, కొరటాల శివ, వంశీ పైడిపల్లి మొదలైన దర్శకులు కలిశారు. ఇదే సమయంలో.. నిర్మాతలు దిల్ రాజు, నవీన్, రవి తో పాటు హీరోలు ఉపేంద్ర, శ్రీకాంత్, నాగ చైతన్య, రానా, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులు పరామర్శించారు.

ఆ సంగతి అలా ఉంటే.. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆరెస్స్ రాజకీయ హాట్ టాపిక్ గా నడించింది. ఇక ఏపీ నుంచి వైసీపీ నేతలు అల్లు అర్జున్ కు బాసటగా నిలిచారు. ఇందులో భాగంగా... అంబటి రాంబాబు, మరికొంతమంది నేతలు ఎక్స్ వేదిగ్గా సపోర్ట్ చేశారు.

మరోపక్క వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేస్తూ... మృతురాలి కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది అని చెప్పిన జగన్... దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు.

ఇదే సమయంలో... తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం సమ్మతం కాదని.. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ సమయంలో శనివారం తాజాగా చంద్రబాబు నేరుగా అల్లు అర్జున్ కి ఫోన్ చేసి పరామర్శించారు!