Begin typing your search above and press return to search.

బాబు గారి అమరావతిని అంత మాట అంటారా ?

అమరావతి అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరవ ప్రాణం అని అందరికీ తెలుసు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 4:00 AM GMT
బాబు గారి అమరావతిని అంత మాట అంటారా ?
X

అమరావతి అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరవ ప్రాణం అని అందరికీ తెలుసు. ఆయన 2015 నుంచి అమరావతిని ప్రపంచ రాజధాని అని చెబుతూ వస్తున్నారు. ఆ పనిలోనే ఉన్నారు. గడచిన పదేళ్ల బాబు కల ఈసారి సాకారం అవుతోందని అంతా నమ్ముతున్నారు.

దానికి తగినట్లుగానే నిధులు కూడా ఇబ్బడి ముబ్బడిగా సమకూరుతున్నాయి. ఈ నేపధ్యంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ జలమయం అయితే అమరావతిలోనూ నీళ్ళు పొంగి పొర్లుతున్నాయి. దాని మీద ప్రత్యర్ధులు అయితే సోషల్ మీడియాలో అమరావతి మునిగింది అని పోస్టులు పెడుతూ ఫోటోలతో తెగ హోరెత్తించేస్తున్నారు.

దీంతో మీడియా సమావేశంలో చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అమరావతి మునిగింది అంటూ విష ప్రచారం చేస్తారా అని ఆయన ఆవేశంతో ఊగిపోయారు. ఒక భ్రష్టు పార్టీ ఏపీలో ఉంది. అది నేరాల పార్టీ, నేరగాళ్ల పార్టి, దానికి పనేమీ లేదు తప్పుడు ప్రచారం చేయడమే తెలుసు. జనాలను మభ్యపెట్టడమే తెలుసు అని బాబు ఫైర్ అయ్యారు.

అమరావతి మునిగిపోయింది ఇంకేమి రాజధాని కడతారు అని విష ప్రచారం చేస్తున్న వారికి కాస్తాయినా బుద్ధీ జ్ఞానం ఉన్నాయా అని బాబు మండిపడ్డారు. ఫ్రాడ్ న్యూస్ ని పుట్టించి దానినే దేశమంతా వ్యాప్తి చేయడంలో వారు సిద్ధ హస్తులు అంటూ ఇండైరెక్ట్ గా వైసీపీ మీద మండిపడ్డారు.

తప్పుడు వార్తలు రాస్తే దానికి తగిన ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుందని బాబు హెచ్చరించారు. అలా చూపించకపోతే కఠినమైన చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు తాను ఏదైనా విషయం చెబితే వింటాను అని అందులో వాస్తవం ఉంటే కూడా భరిస్తామని ఆయన అన్నారు. కానీ కోరి మరీ పనిగట్టుకుని తప్పులు చేస్తూ తప్పుడు రాతలు రాస్తమూ అంటే మాత్రం అటువంటి వాళ్లకు ఏమి చేయాలో అదే చేస్తామని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.

వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యే లేదని కూడా అన్నారు. మొత్తానికి బాబుని హర్ట్ చేసే విధంగా అమరావతి నిండా మునిగింది అని వార్తలు రాశారని అంటున్నారు. ప్రపంచ బ్యాంక్ నుంచి ఏపీకి నిధులు రావాలి. అలాగే పలు ఇంటర్నేషనల్ ఏజెన్సీలు నిధులు సమకూర్చాలి. ఇక పెట్టుబడులను పెట్టే వారు కూడా అమరావతి బ్రాండ్ ఇమేజ్ చూసే వస్తారు.

ఈ విధంగా అమరావతి నిండా మునిగింది అని వార్తలు రాస్తే ఎవరు వస్తారు అన్నదే ఒక బాధ అని అంటున్నారు. అయితే అమరావతి నేల సింకింగ్ సాయిల్ అన్నది ఒక మాట ఉంది. పైగా కొండవీటి వాగు పక్కనే ఉంది. నేల అడుగు పొరలలో సాయిల్ లూజ్ గా ఉంటుంది. దాంతో నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అని కూడా నిపుణులు చెబుతున్నారు.

అయితే ఒక రాజధాని నిర్మాణానికి అంత ఎక్కువ భూమి మరెక్కడా దొరకదు కాబట్టి ఆ స్థలం ఎంచుకున్నారు అని అంటున్నారు. ఎక్కువో ఏమో కానీ అమరావతి రాజధానిని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కంకణబద్ధులై ఉంది. ప్రజలకు కూడా రాజధాని కావాలి. మరి ఈ దశలో ఇంకా ఏమీ కాకుండానే అమరావతి మునిగింది అని రాస్తే ఎలా అన్నదే ఒక ఆవేదనగా ఉంది అని అంటున్నారు. మరి చంద్రబాబు మాత్రం అమరావతి విషయంలో ఈసారి ఎవరు ఎలాంటి చెడు ప్రచారం చేసినా ఊరుకోరు అని అంటున్నారు. చూడాలి మరి బాబు స్ట్రాంగ్ వార్నింగులు ఏ రకమైన యాక్షన్ దిశగా సాగుతాయో.