ఈ సారి జగన్ ప్లేస్ మారుస్తున్నారా..!
ఇదొక సంచలన విషయం. కానీ, నిజమేనని అంటున్నాయి తాడేపల్లి వర్గాలు.
By: Tupaki Desk | 16 July 2023 4:52 AM GMTఇదొక సంచలన విషయం. కానీ, నిజమేనని అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని కొందరు చెబుతున్నారు. మరికొందరు కాదు.. ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని..కానీ ప్లేస్ మారుస్తున్నారని.. అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం బయటకు రాకపోయినా.. ప్రస్తుతం రాజకీయంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోరు.. అనేందుకు మాత్రం సంకేతాలు లేక పోవడం గమనార్హం.
ఇప్పటి వరకు జగన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో ఎంపీగా ఆయన పోటీ చేశారు. 2012లో ఉప ఎన్నికల్లో ఆయన మాతృమూర్తి.. విజయమ్మ. పులివెందుల నుంచి విజయం దక్కించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో సీఎం జగన్ తమకు కలిసి వచ్చిన పులివెందుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో అయితే.. రాష్ట్రంలో ఎవరికీ దక్కని మెజారిటీ కూడా దక్కించుకున్నారు. అయితే.. రాజకీయాలు ఎప్పుడూ.. ఒకే విధంగా ఉండవు.. అంటారు కదా.. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అలానే ఉందని అంటున్నారు.
ఇప్పుడైనా.. గతంలో అయినా.. జగన్‌కు గెలుపు కన్నా మజా ఇచ్చింది.. మెజారిటీనే. తాను అధికారంలోకి వచ్చానన్న సంతృ ప్తికన్నా.. 151 సీట్లు దక్కించుకున్నానన్న ఆనందంతోపాటు ఏకంగా 50 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నానన్న సంతోషం ఆయనకు నచ్చింది. ఇప్పుడు కూడా ఇదే ఆయన అభిలషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పెట్టుకున్న టార్గెట్ వైనాట్ 175 దీనిలో భాగమే. అయితే.. ఇది ఎలా ఉన్నప్పటికీ.. పులివెందుల నుంచి ఆయన సోదరి షర్మిలను బరిలో నిలుపుతారనేవార్తలు కొన్ని రోజుల కిందట తెరమీదికి వచ్చాయి.
ఇది నిజమో కాదో.. తెలియదు. పైగా ఆమె కాంగ్రెస్‌లోకి వచ్చినా.. తెలంగాణకే పరిమితం అవుతారనేది తెలిసిందే. అంతేకాదు.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. ఇటీవలే ప్రకటించారు. ఒకవేళ ఎన్నికల సమయానికి లెక్కలుమారి.. ఆమె కనుక పులివెందుల నుంచి పోటీ చేయాల్సి వస్తే.. అప్పుడు జగన్ రాజంపేట నుంచి పోటీ చేయనున్నట్టుతాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. భారీ మెజారిటీ లక్ష్యంగా వెళ్లాలని ఆయన చూస్తున్న నేపథ్యంలో సొంత కుటుంబం నుంచి పోటీని ఇష్టపడడం లేదు. ఇదిలావుంటే.. షర్మిల కాకపోయినా.. వైఎస్ వివేకా కుమార్తె సునీత పులివెందుల నుంచి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఈ దఫా పులివెందుల నుంచి కాకుండా.. రాజంపేట నుంచి జగన్ పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో వేచి చూడాలి.