Begin typing your search above and press return to search.

ఏపీ అప్పులు 9.74 లక్షల కోట్లు: చంద్రబాబు

400 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రకటన్నింటినీ వాళ్ల పేపర్లకే ఇచ్చుకున్నారని సాక్షి పత్రికపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

By:  Tupaki Desk   |   15 Nov 2024 11:06 AM GMT
ఏపీ అప్పులు 9.74 లక్షల కోట్లు: చంద్రబాబు
X

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ లో ప్రకటించిన ఏపీ అప్పులపై వైసీపీ సభ్యులు గొడవ చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ సభ్యులు వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువ చేసి చూపించిందని, ఇప్పుడు బడ్జెట్ లో మాత్రం 4.6 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందని ప్రకటించిందిని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ అప్పులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లు అని చంద్రబాబు చెప్పారు. కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రావాలని..ఇక్కడే అప్పుల లెక్క తేలుస్తానని చంద్రబాబు సవాల్ విసిరారు...

గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టారని, అది చూస్తే తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పారు.. ప్రజా ధనంతో ఇన్నివందల కోట్ల ప్యాలెస్ లు కట్టడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసి.. ఇలాంటివి చేయడం సిగ్గుచేటన్నారు. 400 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రకటన్నింటినీ వాళ్ల పేపర్లకే ఇచ్చుకున్నారని సాక్షి పత్రికపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

2019లోనూ టీడీపీ గెలిచి ఉంటే పోలవరం 2021లోనే పూర్తి చేసేవారమని చెప్పారు. చంద్రబాబు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధికారం చేపట్టిన జగన్.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం జీఓలను ఆన్లైన్ పెట్టలేదని, కాగ్ నివేదికలు లేవని, స్కామ్ ల కోసం స్కీమ్ లు, దోపిడీ కోసం వ్యవస్థల్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. విభజన నష్టం కంటే.. ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. వేరుశెనగ పంటను అడవి పందులు నాశనం చేసినట్లు.. రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీ అప్పుల వివరాలు...

ఏపీ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు

గవర్నమెంట్ debt - రూ.4,38,278 కోట్లు

పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ - రూ.80,914 కోట్లు

కార్పొరేషన్ debt - రూ.2,48,677 కోట్లు

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ - రూ.36,000 కోట్లు

పవర్ సెక్టార్ - రూ.34,267 కోట్లు

అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ - రూ.1,13,244 కోట్లు

అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ - రూ. 21,980 కోట్లు

నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ - రూ.1,191 కోట్లు.