Begin typing your search above and press return to search.

ఏపీలో పంచాయతీలకు అవార్డులు... పవన్ ఇంట్రస్టింగ్ పోస్ట్!

ఈ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు ప్రధాన కారణం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2024 2:34 PM GMT
ఏపీలో పంచాయతీలకు అవార్డులు... పవన్  ఇంట్రస్టింగ్  పోస్ట్!
X

పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ.. జాతీయ పంచాయతీ అవార్డుల ద్వారా ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలను ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది. ఈ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు ప్రధాన కారణం అని అంటున్నారు. ఈ సందర్భంగా పవన్ స్పందించారు.

అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి! ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కార్ ఇచ్చే పురస్కారాలకు నాలుగు గ్రామాలు ఎంపికయ్యాయి.

ఈ విధంగా... రాష్ట్రంలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయిలోని నాలుగు విభాగాల్లో అవార్డులు లభించగా.. అవార్డులు పొందిన పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు అవార్డులు పొందిన పంచాయతీలు, అవి ఉన్న మండలం, జిల్లా, అవార్డు పొందిన కేటగిరీలను తెలిపుతూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా... మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరీలో 4 జాతీయ అవార్డులను మన గ్రామ పంచాయతీలు సాధించడం ఆనందంగా ఉందని మొదలుపెట్టడం గమనార్హం. ఈ సందర్భంగా.. గ్రామ సర్పంచ్ లకు, కార్యదర్శులకు, సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

ఈ ఘనత స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాలు స్వయంసమృద్ధి సాధించే దిశగా, పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ స్థానిక పరిపాలనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషికి నిదర్శనం అని రాసుకొచ్చారు!

అవార్డులు వచ్చిన పంచాయాతీల్లో... ఆరోగ్యకరమైన పంచాయతీ విభాగంలో చితూరు జిల్లాలోని బొమ్మ సముద్రం ఎంపిక కాగా... నీరు సరిపోయే పంచాయతీ విభాగంలో అనకాపల్లిలోని న్యాయంపూడి గ్రామ పంచాయతీకి అవార్డు దక్కింది. క్లీన్ అండ్ గ్రీన్ కేటగిరీలోనూ అదే జిల్ల్లాలోని తగరంపూడి పంచాయతీకి అవార్డు దక్కీంది.

ఇక.. సామాజికంగా న్యాయంగా, సామాజికంగా సురక్షితమైన పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల గ్రామం ఎంపికయ్యింది. కాగా... ఈ ఏడాది నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు రూ.16,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.