Begin typing your search above and press return to search.

ఇంకా 17 మంది మాత్రం అండర్ గ్రౌండ్లో!.. డీజీపీ షాకింగ్ స్టేట్మెంట్

ఏపీ నుంచి మావోయిస్టుల సమస్య శాశ్వతంగా సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో డీజీపీ ప్రకటన చర్చనీయాంశమవుతోంది.

By:  Tupaki Desk   |   29 Jan 2025 4:10 PM IST
ఇంకా 17 మంది మాత్రం అండర్ గ్రౌండ్లో!.. డీజీపీ షాకింగ్ స్టేట్మెంట్
X

ఏపీలో మావోయిస్టుల ఆలజడి మళ్లీ మొదలైంది. తీవ్ర నిర్బంధాన్ని తట్టుకోలేక ఒడిశా, ఛత్తీస్ గఢ్ పారిపోయిన మావోయిస్టులు మళ్లీ ఏపీలో అడుగుపెట్టారంట. ప్రస్తుతం 30 మంది మావోలు ఏపీ వచ్చారని, అందులో 13 మంది ఉద్యమం నుంచి తప్పుకున్నారని, ఇంకా 17 మంది మాత్రం అండర్ గ్రౌండ్లో ఉన్నారని డీజీపీ ద్వారకాతిరులమరావు వెల్లడించారు. ఏపీ నుంచి మావోయిస్టుల సమస్య శాశ్వతంగా సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో డీజీపీ ప్రకటన చర్చనీయాంశమవుతోంది.

ఛత్తీస్ గఢ్ నుంచి 30 మంది మావోయిస్టులు ఏపీకి వచ్చారని తమకు సమాచారం అందినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ విషయం బయటకు చెప్పకూడదు అంటూనే డీజీపీ బాంబ్ పేల్చారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న డీజీపీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ఇదే క్రమంలో మావోయిస్టులు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఛత్తీస్ గఢ్ అడవుల్లో దండయాత్ర చేస్తోంది. గత నెల రోజుల్లో 50 మందిని ఎన్ కౌంటర్ చేసింది.

ఆపరేషన్ కగార్ పేరుతో ప్రత్యేకంగా కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలు మావోయిస్టులను తీవ్రంగా దెబ్బతీశారు. దీంతో గత ఏడాదిన్నరలో సుమారు 700 మంది హతమయ్యారు. భద్రతా బలగాల ఆపరేషన్ తో మావోయిస్టులకు సేఫ్ జోన్ అంటూ లేకపోయింది. ఒకప్పుడు ఏపీలోని నల్లమల, ఏవోబీ కేంద్రంగా మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగేవి. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దులకు తమ మకాం మార్చారు. విశాఖ ఏజెన్సీలోని మూడు రాష్ట్రాల సరిహద్దులు కలుస్తుంటాయి. దీంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టులు యాక్షన్ ఉండేది. ఆ ప్రాంతంలోనూ నిర్బంధం ఎక్కువగా ఉండటం వల్ల ఛత్తీస్ గఢ్ అడవుల్లోని దండకారుణ్యాన్ని తమ షెల్టర్ జోన్ గా చేసుకునేవారు.

ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోటగా చెప్పిన ప్రాంతాల్లోనూ పోలీసులు పాగా వేయడంతో రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్న వారంతా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇలా ఏపీలో 30 మంది అడుగుపెట్టారని ప్రభుత్వానికి సమాచారం అందింది. వీరిలో కొందరు ప్రభుత్వానికి లొంగిపోయే ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. వీరి భవిష్యత్ కార్యకలాపాలపై నిఘా విభాగం ఓ కన్నేసి ఉంచేది. ఏదిఏమైనా మావోయిస్టులు మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టారనే వార్త ఆలజడి రేపుతోంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు హై అలర్ట్ అయ్యారు. పోలీసులు కూడా నిఘా పెంచినట్లు చెబుతున్నారు.