ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... రూ.55 కే పెట్రోల్, డీజిల్!
గత దశాబ్ధ కాలంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 11 Jan 2025 10:08 AM GMTగత దశాబ్ధ కాలంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన మోడీ సర్కార్ చే యడం లేదని అంటున్నారు. ఈ సమయంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
అవును... నూతన సంవత్సరంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ప్రస్తుతం పెట్రోల్ ధర ఏపీలో సుమారు రూ.110 ఉండగా.. డీజిల్ ధర దాదాపు రూ.98 ఉన్న పరిస్థితి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా... ఏపీలోని కూటమి ప్రభుత్వం సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా... లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ కేవలం రూ.55 లకే అందించనున్నట్లు ప్రకటించింది. అయితే... ఈ ఆఫర్ వాహనదారులు అందరికీ కాదు.. కేవలం దివ్యాంగులకు మాత్రమే అని తెలిపింది! వీళ్లకు మాత్రమే పైన చెప్పుకున్న ధరకు ఏపీలో పెట్రోల్, డీజిల్ వస్తుంది. దీనికోసం ఆయా జిల్లాల్లోని దివ్యాంగులు సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మూడు చక్రాల మోటరైజ్డ్ వెహికల్ కలిగిన దివ్యాంగులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలపై 50 శాతం రాయితీ ఇస్తున్న సబ్సిడీ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలకూ రూ.26 లక్షలు కేటాయించినట్లు కథనాలొస్తున్నాయి! ఈ రాయితీ పొందాలనుకునే వారు బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు సదరు దివ్యాంగుల బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. వీరు ప్రభుత్వం తెలిపిన ధృవీకరణ పత్రాలతో ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో.. 2హెచ్పీ వాహనం అయితే నెలకు 15 లీటర్లు, అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉండే వాహనం అయితే నెలకు 25 లీటర్ల వరకూ రాయితీ పొందే అవకాశం ఉంటుంది.
ఈ సబ్సిడీ పొందేందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు!:
1. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
2. వికలంగు సర్టిఫికెట్
3. డ్రైవింగ్ లైసెన్స్
4. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)
5. బ్యాంక్ అకౌంట్ బుక్ ఫస్ట్ పేజీ
6. వైట్ రేషన్ కార్డ్
7. ఆధార్ కార్డ్
8. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ధృవీకరణ పత్రం
9. ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
10. పెట్రోల్ / డీజిల్ కొనుగోలు చేసిన బిల్లులు