Begin typing your search above and press return to search.

ఉచిత బస్సు ఉత్సాహం నీరు కారిందా ?

ఏపీలో ఉచిత బస్సు తిరుగుతుందని తాము కోరుకున్న చోటికి వెళ్లవచ్చు అని మహిళలు అయితే తెగ ఆనందపడ్డారు.

By:  Tupaki Desk   |   7 March 2025 8:00 PM IST
ఉచిత బస్సు ఉత్సాహం నీరు కారిందా ?
X

ఏపీలో ఉచిత బస్సు తిరుగుతుందని తాము కోరుకున్న చోటికి వెళ్లవచ్చు అని మహిళలు అయితే తెగ ఆనందపడ్డారు. ఈ రోజులలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు చార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయి. అందుకే ఉచిత బస్సు హామీ అంటే ఓట్ల వర్షం కురుస్తోంది. అది కర్ణాటక అయినా తెలంగాణా అయినా ఏపీ అయినా ఉచిత బస్సు పధకానికి మహిళాలోకం నీరాజనాలు పట్టింది.

అయితే తెలంగాణాలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రావడమేంటి ఉచిత బస్సు పధకాన్ని విజయవంతంగా అమలు చేశాయి. రాష్ట్రమంతటా ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచిత బస్సులో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీని వల్ల ఆర్టీసీకి నష్టం వచ్చినా ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది వచ్చినా కూడా ధైర్యంగానే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ సై అంటూ ఉచిత బస్సుని అలా నడుపుతున్నారు.

కానీ ఏపీలో మాత్రం హామీ అలాగే ఉండిపోయింది. తాజాగా భారీ బడ్జెట్ ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినా అందులో ఉచిత బస్సు ప్రస్తావన అన్నది అసలు లేదు. కేటాయింపులు అంతకంటే లేవు. దాంతో ఉచిత బస్సు పధకం అటకెక్కిందని విపక్షాలు గట్టిగానే విమర్శించాయి.

ఈ నేపధ్యంలో ఈ అనుమానాన్ని ఏకంగా సభలోనే తేల్చుకోవాలని వైసీపీ చూసింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శాసనమండలిలో మాట్లాడుతూ ఉచిత బస్సు పధకం అమలు ఎపుడు అని ప్రశ్నించడమే కాకుండా అన్నవరం టూ తిరుపతికి మహిళా ప్రయాణీకులు వెళ్ళేందుకు ఆసక్తిగా చూస్తున్నారు అని అన్నారు. దానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జవాబు ఇస్తూ ఉచిత బస్సు రాష్ట్రమంతా తిరగదని చల్లగా కబురు చెప్పారు.

కేవలం జిల్లాలో మాత్రమే నడుపుతామని చెప్పి తుస్సుమనిపించారు. దీంతోనే ఇపుడు ఉచిత బస్సు ఉత్సాహం నీరు కారిందని అంటున్నారు. ఉచిత బస్సు జిల్లా దాటకపోతే ఉపయోగం ఏమిటని అంటున్నారు. దూర ప్రయాణాలకు పనికివస్తుందని కదా ఈ పధకానికి జనాలు ఆకర్షితులై ఓట్లేసింది అని అంటున్నారు.

కేవలం జిల్లాలో మాత్రమే నడుపుతామని చెప్పి తుస్సుమనిపించారు. దీంతోనే ఇపుడు ఉచిత బస్సు ఉత్సాహం నీరు కారిందని అంటున్నారు. ఉచిత బస్సు జిల్లా దాటకపోతే ఉపయోగం ఏమిటని అంటున్నారు. దూర ప్రయాణాలకు పనికివస్తుందని కదా ఈ పధకానికి జనాలు ఆకర్షితులై ఓట్లేసింది అని అంటున్నారు.

ఇక జిల్లాలో కూడా కొన్ని నిర్దేశిత ప్రాంతాలలో ఈ ఉచిత బస్సులను తిప్పుతామని మరిన్ని సవాలక్ష కండిషన్లు పెడితే ఈ బస్సు పధకం ఎందుకు అన్న చర్చ కూడా వస్తోంది. ఇక ఉచిత బస్సుని రాష్ట్రమంతటా అమలు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం ఖర్చు అవుతుందని ఆర్టీసీకి నష్టం వస్తుందని కర్ణాటక తెలంగాణా అనుభవాలతో ఏపీ సర్కార్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

అంతే కాదు అదనంగా బస్సులు కొనాలి, అలాగే సిబ్బందిని అదనంగా తీసుకోవాలి. దానికి తడిసి మోపెడు అవుతుందని లెక్క కడుతున్నారు. అదే జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు అంటే కనుక కచ్చితంగా చాలా ఎక్కువగానే ఖర్చు మిగులుతుంది అని అంటున్నారు. అంతే కాదు ప్రత్యేకంగా సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఈ పధకం ఇచ్చినట్లుగా అమలు చేసినట్లుగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ఇదీ విషయం.

మరి అశ్వద్ధామ హతహా అని గట్టిగా అరచి కుంజరహా అని మెల్లగా మాట్లాడినట్లుగానే ఉంది ఈ ఉచిత బస్సు పధకం అని జనాలు అంటున్నారు. రాష్ట్రమంతటా అని గట్టిగా చెప్పి ఇపుడు జిల్లాలకు మాత్రమే అని మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కడం పట్ల అసంతృప్తి అయితే గట్టిగానే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.