టీటీడీ ఛైర్మన్ క్రీస్టియన్ అంటూ ప్రచారం... స్పందించిన ప్రభుత్వం!
అయితే.. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. బీఆర్ నాయుడు క్రీస్టియన్ అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 31 Oct 2024 8:11 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలిని 24 మందితో ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా... టీటీడీ ఛైర్మన్ గా టీవీ5 న్యూస్ ఛానల్ అధినేత బీఆర్ నాయుడుని నియమించింది. ఇదే సమయంలో సభ్యులుగా ఎమ్మెల్యేలతో పాటు వివిధ రంగాల నుంచి మరో 20 మందికి అవకాశం కల్పించింది.
ఇందులో భాగంగా... జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నారు. ఇక టీటీడీ ఛైర్మన్ గా ఎంపికైన న్యూస్ ఛానల్ అధినేత బీఆర్ నాయుడు గురించి ఓ విషయం సోషల్ మీడియా వేదికగా సంచలనగా మారింది. తాజాగా దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
అవును... తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు.. క్రీస్టియన్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది . అయితే.. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. బీఆర్ నాయుడు క్రీస్టియన్ అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా... "టీటీడీ ఛైర్మన్ గా ఎంపికైన బీఆర్ నాయుడు బ్రాండ్ ని మార్ఫింగ్ చేసి, ప్రముఖుల పేరుతో ఫేక్ అకౌంట్లు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. దీని వెనుక వైసీపీ కిరాయి మూకలున్నాయని ఆధారాలు లభించాయి. ఫేక్ అకౌంట్ ఫేక్ ఫెలోస్ కి ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్" అని స్పష్టం చేసింది!
అదృష్టంగా భావిస్తున్నాను: బీఆర్ నాయుడు
ఇక టీటీడీ ఛైర్మన్ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు బీఆర్ నాయుడు అన్నారు. ఇదే సమయంలో... తనను ఈ పదవిలో నియమించినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని విమర్శించారు.