Begin typing your search above and press return to search.

రేషన్ బియ్యం అక్రమ రవాణా... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

ఈ సమయంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 9:30 PM GMT
రేషన్  బియ్యం అక్రమ రవాణా... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
X

ఏపీ రాజకీయాల్లో ఇటీవల కాకినాడ పోర్టు కేంద్రంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన తనిఖీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ఆయన నోటి నుంచి వచ్చిన "సీజ్ ది షిప్" అనే మాట ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో, మరేస్థాయిలో ట్రెండింగ్ గా మారిందో తెలిసిందే. ఈ సమయంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వేల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని.. పేదలకు చేరాల్సిన ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొని, అధిక ధరలకు విదేశాలకు ఎగుమతి చేస్తూ వేల కోట్లు సంపాదిస్తున్నారని తీవ్ర ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.

ఈ సమయంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. పవన్ కల్యాణ్ టెకప్ చేసిన ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన వేళ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇది కీలక పరిణామం అని అంటున్నారు.

ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఆరుగురు సభ్యులు ఉంటుండగా.. ఈ సిట్ కు చీఫ్ గా వినీత్ బ్రిజ్ లాల్ కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇక మిగిలిన సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు గోవిందరావు, అశోక్ వర్ధన్, బాలసుందర్ రావు, రత్తయ్యలను నియమించారు.

ఇక ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. ప్రతీ 15 రోజులకు ఒకసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా సిట్ కు పూర్తిస్థాయి అధికారాలు అప్పగించింది. కాగా... పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో ఇప్పటివరకూ సుమారు 13 ఎఫ్.ఐ.ఆర్. లు నమోదయ్యాయని తెలుస్తోంది.