చెత్త పన్నుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
ఈ నిర్ణయంపై అప్పట్లో కూటమి నేతలు వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
By: Tupaki Desk | 22 Feb 2025 7:56 AM GMTగత ప్రభుత్వ హయాంలో చెత్తపై పను వేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయంపై అప్పట్లో కూటమి నేతలు వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలోనూ అది కీలక అస్త్రంగా మారింది. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
అవును... చెత్తపై పన్ను విషయం గత ప్రభుత్వ హయాంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లు మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ సందర్భంగా.. చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ గత ఏడాది డిసెంబర్ లో కూటమి సర్కార్ తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దీనికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇందులో... చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం 1965లో చేర్చిన సెక్షన్ 170-బి, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 491-ఏ ను తొలగిస్తున్నట్లు ప్రభుతం పేర్కొంది. దీంతో.. ఇకపై ఏపీలో చెత్తపై పన్ను ఉండదు!
కాగా... నవంబర్ 2021లో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సుమారు రూ.187.02 కోట్ల మేర వసూలు చేసింది. దీనిపై కూటమి పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి.. అయినప్పటికీ జగన్ సర్కార్ పరిగణలోకి తీసుకోలేదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఇది కీలకంగా మారింది.