Begin typing your search above and press return to search.

లోకేష్ పంతం నెగ్గిందా ?

ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా నారా లోకేష్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Oct 2024 3:30 AM GMT
లోకేష్ పంతం నెగ్గిందా ?
X

ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా నారా లోకేష్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన శాఖతో పాటు తన వద్దకు వచ్చిన అనేక విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి కిరీటం అయితే లేదు కానీ ఆయన కూడా బాబు పవన్ తో సమానంగా మొత్తం బాధ్యతలు చూస్తున్నారు అని ప్రచారంలో ఉంది.

అందుకే ఆయనకు ఇటీవల ప్రకటించిన జిల్లా ఇంచార్జి మంత్రుల లిస్టులో చేర్చకుండా కూటమిలో టాప్ త్రీలో ఒకరుగా ఉంచారు అని అంటున్నారు. ఇక టీడీపీ కూటమిలో కొన్ని నిర్ణయాలలో లోకేష్ పాత్ర ముఖ్యంగా ఉందని ఆయన మాట చలామణీ అవుతోంది అని అంటున్నారు

అలాంటిదే ఇపుడు మరొకటి జరిగిందని అని చెబుతున్నారు. అదే టీటీడీ బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు పేరుని కన్ ఫర్మ్ చేయడం అని అంటున్నారు. బీఆర్ నాయుడు పేరు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రోజుల నుంచి వినిపిస్తోంది.

బీఆర్ నాయుడు పేరు ఎంతలా నలిగింది అంటే ఇప్పటికి రెండు నెలల ముందే ఆయన పేరుతో ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ మధ్యలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది అన్నది పెద్ద సంచలనంగా మారింది అని అంటున్నారు. దాంతో కొంత వెనకా ముందు జరిగింది తప్పించి బీఆర్ నాయుడు పేరు ఏనాడో ఖరారు అయింది అని అంటున్నారు

ఇక బీఆర్ నాయుడు నియామకం వెనక ఆయన పేరు ఎంపిక చేయడం వెనక లోకేష్ పట్టుదల ఉందని అంటున్నారు. టీటీడీ చైర్మన్ పోస్ట్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనది. దీని కోసం ఎంతో మంది పేర్లు వచ్చినా కూడా చివరికి నాయుడు పేరు దగ్గరే ఆగిపోవడానికి లోకేష్ ఆలోచనలే కారణం అని అంటున్నారు.

ఇక బీఆర్ నాయుడు నాయకత్వంలోని మీడియా చానల్ టీడీపీకి ఎన్నికల్లో పూర్తిగా అనుకూలంగా ప్రచారం చేసిందని కూడా చెబుతారు. అంతే కాదు లోకేష్ యువగళం పాదయాత్రను ఫుల్ గా కవర్ చేయడమే కాకుండా హైప్ క్రియేట్ చేసింది అని అంటారు

గత అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో ప్రతీ రోజూ కూడా ఆ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపడంలో అచ్చమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది అని అంటారు. మొత్తానికి టీడీపీ అధినాయకత్వం వద్ద మంచి మార్కులు చూరగొన్న నేపధ్యంలోనే నాయుడుకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు

ఇక నాయుడుది తిరుపతి జిల్లా అని చెబుతున్నారు. ఆయనకు ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని అంటారు. అది ఈ విధంగా తీరబోతోంది అని అంటున్నారు. ఇంతకీ బీఆర్ నాయుడు పూర్తి పేరు ఏమిటో తెలుసా. బొల్లినేని రాజగోపాల్ నాయుడు. షార్ట్ కట్ లో బీఆర్ నాయుడు గా ప్రాచుర్యం పొందారు.

ఆయన తనదైన మీడియా సంస్థను సక్సెస్ ఫుల్ గా నడిపారు. ప్రపంచ దేవుడు అయిన తిరుమల శ్రీవారి ఆలయానికి పాలనకు సంబంధించిన టీటీడీ చైర్మన్ గా ఆయన చాలా కీలకమైన బాధ్యతలను ఎత్తుకున్నారని అంటున్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ మీద ఇపుడు ప్రపంచం ఫోకస్ పూర్తిగా ఉంది. అలాగే టీటీడీలో ఆధ్యాత్మిక భావం వెల్లివిరియ చేసేలా చూడాలి. లోపాలు ఏమైనా ఉంటే సర్దుబాటు చేయాలి. ఒక విధంగా చాలెంజ్ గానే ఈ పదవి ఉంటుంది. మరి నాయుడు గారి పాలన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.