ఆమ్రపాలికి దక్కిన కీలక పొస్టింగ్!
ఆమె తెలంగాణాలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా సేవలు అందించారు.
By: Tupaki Desk | 28 Oct 2024 3:35 AM GMTతెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది అందరి దృష్టి ఎక్కువగా యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి మీద ఉంది. ఆమెకు కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన పర్యాటక శాఖను కేటాయించింది. ఆమెను టూరిజం డిపార్టుమెంట్ ఎండీగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఆమె ఈ పదవిలో తన ప్రతిభను చూపించి న్యాయం చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది అని అంటున్నారు
ఆమె తెలంగాణాలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా సేవలు అందించారు. దాంతో ఆమెను విశాఖ కానీ విజయవాడ కానీ కార్పొరేషన్ కి కమిషనర్ గా నియమిసారు అని అంతా అనుకున్నారు. కానీ ఆమెను ఏదో ఒక సిటీకి పరిమితం చేయకుండా ఏపీ వ్యాప్తంగా ఆమె సేవలను వినియోగించుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా కూటమి ప్రభుత్వం తాజా నియామకంతో స్పష్టం చేసింది అని అంటున్నారు
ఏపీ ప్రభుత్వం టూరిజం శాఖను ముఖ్యమైనదిగా భావిస్తోంది. ఈ శాఖను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకుని రావాలని చూస్తోంది. దాంతో డైనమిక్ ఆఫీసర్ ఈ శాఖకు ఉంటే బాగుంటుంది అని ఉద్దేశించి ఆమ్ర్పాలిని ఎంపిక చేశారు అని అంటున్నారు.
ఇక తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఇత్ర ఐపీఎస్ అధికారులకు కూడా పోస్టింగులు కేటాయించారు. అందులో చూస్తే వైద్యారోగ్యశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణని నియమించారు. అలాగే జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణీమోహన్ ని నియమించారు. ఇక కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్ ని నియమించారు అయితే తెలంగాణ నుంచి వచ్చిన మరో అధికారి రోనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ దక్కలేదు. మొత్తానికి చూస్తే ఆమ్రపాలికి ఎక్కడ పోస్టింగ్ ఏమిటి అన్న ఉత్కంఠకు కూటమి ప్రభుత్వం తెర దించింది.
అదే విధంగా తెలంగాణా నుంచి ఏపీకి వచ్చిన ఈ ఐఏఎస్ అధికారులందరి సేవలను వాడుకునేలా కీలకమైన బాధ్యతలనే అప్పగించింది. ఏపీలో అడ్మినిస్ట్రేషన్ ని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారు. దాంతో పాటు సమర్ధత ప్రతిభ ఆధారంగా చేసుకుని ముఖ్య విభాగాలలో పోస్టింగులను ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ ప్రభుత్వం పాలన విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండడమే కాకుండా అభివృద్ధిని వేగవంతం చేయడం పెట్టుబడులే లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన ప్రాధాన్యతలు ఏమిటి అన్నది ప్రతీ నిర్ణయంలోనూ చాటి చెబుతోంది.