Begin typing your search above and press return to search.

మర్డర్ కేసు.. మాజీమంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో బిగ్ షాక్!

అవును... విలేకరి హత్యకేసులో దాడిశెట్టి రాజాపై తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తాజాగా హైకోర్టు కొట్టివేసింది.

By:  Tupaki Desk   |   5 Nov 2024 7:10 AM GMT
మర్డర్  కేసు.. మాజీమంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో  బిగ్  షాక్!
X

విలేకరి హత్యకేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజాకు తాజాగా బిగ్ షాక్ తగిలింది! ఇందులో భాగంగా... ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2019లో జరిగిన ఓ విలేకరి హత్య కేసులో తుని రూరల్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఆయనకు చెక్కెదురైంది.

అవును... విలేకరి హత్యకేసులో దాడిశెట్టి రాజాపై తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాళ్లోకి వెళ్తే... 2019 అక్టోబరు 15న రాత్రి 7 గంటల సమయంలో తుని అసెంబ్లీ నియోజకవర్గం, తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణ (47) టూవీలర్ పై ఎస్ అన్నవరంలోని ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో చెరువుగట్టుపై కొందరు అడ్డగించి ఆయనపై కత్తులతో నరికి చంపేశారు.

అయితే... ఈ హత్యలో దాడిశెట్టి రాజా సూత్రధారి అనేది మృతిని కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. దీంతో.. కుటుంబసభ్యుల ఫిర్యాదులో తుని రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ హత్య కేసులో దాడిశెట్టి రాజాతో సహా ఆరుగురిని నిందితులుగా చేర్చారు. అయితే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రి అయ్యక ఛార్జిషీట్ లో ఆయన పేరు తప్పించారు.

ఇదే సమయంలో... ఆయన మంత్రి అయిన తర్వాత కేసు కూడా ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో నిందితులను శిక్షించాలంటూ మృతుని సోదరుడు న్యాయవాది కాతా గోపాలకృష్ణ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. ఇదే సమయంలో రాజాపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టునూ ఆశ్రయించారు.

అదేవిధంగా... యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు లోకేష్ ను కలిసిన గోపాలకృష్ణ.. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. దీంతో.. నాడు లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు! దీంతో... ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు రాజా. అయితే... ఆ పిటిషన్ ను తాజాగా కోర్టు కొట్టివేసింది.