పేర్ని నాని పిటీషన్ పై ఏపీ హైకోర్టు అభ్యంతరం
అయితే ఇప్పటికే పోలీసులిచ్చిన విచారణ గడువు ముగిసి రెండు రోజులైనందున పిటిషనను విచారించలేమని న్యాయమూర్తి చెప్పారు.
By: Tupaki Desk | 24 Dec 2024 12:31 PM GMTమచిలీపట్నం రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రేషన్ బియ్యం మాయం కేసులో తనతో పాటు కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నాని హైకోర్టును ఆశ్రయించగా, అప్పటికే పోలీసులిచ్చిన గడువు సమయం ముగిసిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. మళ్లీ పోలీసులు నోటీసులిస్తే అప్పుడు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం విచారించిన పిటిషన్ ఉపసంహరించుకునేలా ఉత్తర్వులిచ్చారు.
పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్న గొడౌన్లలో రేషన్ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు ఈ నెల 22న పోలీసుస్టేషనుకు రావాల్సిందిగా సూచిస్తూ నోటీసులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఇప్పటికే పోలీసులిచ్చిన విచారణ గడువు ముగిసి రెండు రోజులైనందున పిటిషనను విచారించలేమని న్యాయమూర్తి చెప్పారు. దీంతో పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వాలని, పోలీసులు తిరిగి నోటీసిస్తే పిటిషన్ దాఖలు కేసులో నిందితురాలైన మాజీ మంత్రి భార్య జయసుధ బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది.
పీపీ సెలవులో ఉండటంతో విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసుపై ప్రాసిక్యూషన్ తరపున మంగళవారం కౌంటర్ దాఖలు చేయాల్సివుంది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవు పెట్టడంతో కేసును వాయిదా వేస్తున్నామని, కౌంటర్ దాఖలు విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసులో పేర్ని జయసుధ బెయిల్ పిటీషన్ వాయిదా పటడం ఇది నాలుగో సారి. మచిలీపట్నంలో జయసుధ పేరిట ఉన్న గిడ్డంగుల్లో 187 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమయ్యాయని ఈ నెల తొలి వారంలో గుర్తించారు. ఈ వ్యవహారంలో జయసుధపై సివిల్ సప్లై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పేర్ని కుటుంబం అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయింది. మరోవైపు పోలీసులు మాజీ మంత్రి ఇంటికి నోటీసులు అంటించడంతోపాటు జయసుధపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.