చంద్రబాబుతో పవన్, అనిత భేటీ... తెరపైకి హోంశాఖలో మార్పులు?
అయితే ఇటీవల పిఠాపురం పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యల అనంతరం... ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 7 Nov 2024 10:52 AM GMTఏపీలో లా అండ్ ఆర్డర్ పై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యవహారంపై గత కొన్ని నెలలుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇటీవల పిఠాపురం పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యల అనంతరం... ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇందులో భాగంగా.. తాను హోంమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని.. తానే హోంమంత్రి పదవి తీసుకోవాల్సిన పరిస్థితి తేవొద్దని.. ఏపీలో జరుగుతున్న ఘటనలపై అనిత బాధ్యత తీసుకోవాలని పవన్ ఫైర్ అయ్యారు! ఈ సమయంలో... అటు పవన్, ఇటు అనిత ఈ రోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇది హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబుతో పవన్, హోంమంత్రి అనిత సమావేశమయ్యారు. హోంమంత్రిపై పవన్ వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నేపథ్యంలో వీరి సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో రాష్ట్ర హోంశాఖలో పలు మార్పుల గురించి చర్చించే అవకాశం ఉందని అంటున్నారు!
ఈ భేటీలో ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబుకు పవన్ వివరించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యల గురించి పవన్ కు చంద్రబాబు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొందని అంటున్నారు.
మరోపక్క... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత లతో పాటు డీబీవీ స్వామి, దళిత ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా... ఎస్సీ వర్గీకరణం అంశంపై పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించిస్తున్నారని.. దీనికి సంబంధించి ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది!