Begin typing your search above and press return to search.

అంతా బీజేపీ మహిమ : పవన్ దూకుడు...టీడీపీ అలెర్ట్

జనసేన అధినేత ఇటీవల రోజుల వ్యవధిలోనే వరసగా రెండు సభలలో పాత జనసేనానిని గుర్తుకు వచ్చేలా బిగ్ సౌండ్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Nov 2024 3:47 AM GMT
అంతా బీజేపీ మహిమ : పవన్ దూకుడు...టీడీపీ అలెర్ట్
X

కేంద్రంలో బీజేపీ ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయింది. జమిలి ఎన్నికల పల్లవిని అందుకుంది. ఈ మధ్యనే కొద్ది నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. బీజేపీకి అయితే ఆ ఫలితాలు కొంత అసంతృప్తిని మిగిలించాయి. ఉందిలే మంచి కాలం అని అనుకోవాలంటే అయిదేళ్ళు ఆగాలి.

అంతవరకూ ఊతకర్రల లాంటి మిత్రుల మద్దతుతో కేంద్రంలోని ఎన్డీయే బండిని లాగించాలి. అయితే బీజేపీ పెద్దల మాస్టర్ మైండ్ కాస్తా ఎన్నికలను ముందుకు తీసుకుని వచ్చేస్తోంది. అందుకే జమిలి రాగం అందుకున్నారు. ఆ మేరకు మిత్రులకు స్పష్టమైన సంకేతాలు అందాయి.

ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు ముగిసి గట్టిగా ఆరు నెలలు కాకుండానే మళ్ళీ రాజకీయ రణన్నినాదాలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత ఇటీవల రోజుల వ్యవధిలోనే వరసగా రెండు సభలలో పాత జనసేనానిని గుర్తుకు వచ్చేలా బిగ్ సౌండ్ చేశారు. తొక్కి పట్టి నారా తీస్తాను అని ఏలూరు సభలో చెప్పిన పవన్ విపక్షాలకు అలా గట్టి వార్నింగ్ ఇచ్చేసారు

ఇక లేటెస్ట్ గా పిఠాపురం సభలో మాట్లాడిన ఆయన స్వపక్షానికే స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు. లా అండ్ ఆర్డర్ ఏపీలో బాగాలేదని సౌండ్ వచ్చేలా పవన్ చేసిన గర్జనలో చాలానే మ్యాటర్ ఉంది అని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి వినిపించిన ఈ హెచ్చరికలో ఎన్నో అర్థాలు పరమార్థాలు ఉన్నాయని అంటున్నారు.

తప్పు జరిగితే సొంత ప్రభుత్వం అయినా చూడను అన్న సంకేతాన్ని జనంలోకి పంపించడం అందులో ఒకటి అయితే తమ ప్రభుత్వంలోనూ తప్పులు జరుగుతున్నాయని హెచ్చరించి అలెర్ట్ చేయడం మరో ఉద్దేశ్యం అని అంటున్నారు. ఇక జనసైనికులకు హుషారు తెప్పించడం మరో అతి ముఖ్యమైన విషయం.

ఏది ఏమైనా చాలా కాలానికి పవన్ లో దూకుడు చూశామని జనసైనికులు సంతోషిస్తూంటే తమ తరఫున ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ గొంతు విప్పుతున్నారని ఏపీ జనం అనుకుంటున్నారు. ఇక కూటమిలో టీడీపీ అయితే అలెర్ట్ కావడానికే పవన్ ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారని సమాధానం పడాల్సి వస్తోంది.

అయితే జమిలి ఎన్నికలు అంటే మరో రెండున్నరేళ్ళలో వస్తాయి. చూస్తూండగానే కాలం కరిగిపోతుంది. దాంతో ప్రభుత్వంలో ఉన్న వారికి యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దానిని బ్యాలెన్స్ చేసేందుకు అదే సమయంలో తన బలాన్ని పెంచుకునేందుకు పవన్ ఈ తరహా కామెంట్స్ చేశారు అని అంటున్నారు. అంతే కాదు విపక్షాలకు ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా ప్రభుత్వంలోనే ప్రతిపక్షంగా ఉంటూ డ్యూయల్ రోల్ పోషించడం ద్వారా పవన్ వైసీపీకి ఝలక్ ఇచ్చారని కూడా అంటున్నారు

ఇక ఏపీలో పవన్ ఆశాజ్యోతిగా బీజేపీ పెద్దలకు కనిపిస్తున్నారు. పవన్ మాట భాష కూడా వారిని అనుకూలంగా మారుతోంది. ఆయన ఇస్తున్న ఉదాహరణలు కూడా బీజేపీ ముఖ్యమంత్రులవి కావడం విశేషం. యూపీలో బీజేపీ సీఎం యోగీ తరహాలో ఏపీలో పదునైన చట్టం వాడాలని పవన్ సూచిస్తున్నారు. అంటే బీజేపీ తరహా పాలన కావాలని ఆయన కోరుకుంటున్నారు అని చెబుతున్నారు

ఏపీలో పవన్ ద్వారా జమిలి ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు రేపటి రోజున ఏపీలో అధికారానికి మరింత దగ్గర కావాలని బీజేపీ వేస్తున్న ఎత్తులలో భాగంగా పవన్ దూకుడుని చూడవచ్చా అంటే రాజకీయాల్లో ఎలాగైనా విశ్లేషించుకోవచ్చు అని అంటున్నారు

ఇక తెలుగుదేశం విషయానికి వస్తే కూటమిలో మూడు పార్టీలూ కలసి ఉన్నా చాన్స్ వస్తే బీజేపీ జనసేన రెండూ ఒక్కటిగా నిలబడతాయన్న డౌట్లూ ఉన్నాయి. దాంతో తనదైన వ్యూహాలను రచిస్తూ టీడీపీ ముందుకు పోతోంది. జమిలి వచ్చినా తన బలాన్ని బలగాన్ని కాపాడుకోవడమే కాకుండా వైసీపీని చిత్తు చేయాలన్నది టీడీపీ ఎత్తుగడగా ఉంది.

అదే సమయంలో కూటమిని పదిలంగా ఉంచుకోవడం ఇవే పొత్తులను కంటిన్యూ చేయడం కూడా టీడీపీ ఆలోచన అని చెబుతున్నారు. మిత్రులు ఎంత దూకుడు చేసినా టీడీపీ కనుసన్నల్లోనే ఏపీ రాజకీయం సాగేలా పసుపు శిబిరంలో అపర చాణక్యం సాగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా జమిలి వేడి అయితే కూటమిలో కనిపిస్తోంది అనడానికి లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉదాహరణగా చెబుతున్నారు.