Begin typing your search above and press return to search.

ఇక బాబు మన్ కి బాత్

అయితే మోడీ మన్ కీ బాత్ కంటే ముందే దేశంలో ఏ సీఎం కి రాని విధంగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి ఈ ఆలోచన నాడే వచ్చింది

By:  Tupaki Desk   |   23 Nov 2024 4:05 AM GMT
ఇక బాబు మన్ కి బాత్
X

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ 2014లో అధికారం చేపట్టాక ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ పేరుతో ప్రతీ నెల ఆఖరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ప్రజలతో నేరుగా మమేకం అయ్యేందుకు మోడీ ఎంచుకున్న ఈ మధ్యమం ఆయనకు బాగా పేరు తెచ్చింది. ఇప్పటికీ మోడీ మన్ కీ బాత్ కొనసాగిస్తూనే ఉన్నారు.

అది వందకు పైగా సంచికలను దాటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇకపోతే ఏపీలో కూడా బాబు మన్ కి బాత్ ని వినిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు దీని మీద తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వారితో నేరుగా కనెక్ట్ కావడం ద్వారా మరింతగా ప్రభుత్వాన్ని చేరువ చేయవచ్చు అన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. అయితే మోడీ మన్ కీ బాత్ కంటే ముందే దేశంలో ఏ సీఎం కి రాని విధంగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి ఈ ఆలోచన నాడే వచ్చింది

ఆయన డయల్ యువర్ సీఎం అంటూ 1995 నుంచి 2004 మధ్యలో చేపట్టిన కార్యక్రమం నాడు సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఈ కార్యక్రమం పెను సంచలనాన్ని కూడా క్రియేట్ చేసింది. ఒక ముఖ్యమంత్రి ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడడం వారి సమస్యలను తెలుసుకోవడం అన్నది వినూత్న కార్యక్రమంగా అంతా భావిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో అది బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రజలు కూడా నాడు డయల్ యువర్ సీఎం కార్యక్రమం ద్వారా బాబుకి ఫోన్ చేసి సమస్యలను వివరిస్తూ వచ్చేవారు. వాటి పరిష్కారం కూడా వేగంగా జరిగేది. ఇక విభజన ఏపీలో 2014 నుంచి 2019 దాకా బాబు ఈ తరహా కార్యక్రమాలు తలపెట్టలేదు

కానీ ఇపుడు బాబు మదిలో మళ్లీ అలాంటి ఆలోచన పుడుతోంది. అందుకే ఆయన మోడీ తరహాలో వినూత్నంగా మన్ కీ బాత్ లాంటి ఒక పవర్ ఫుల్ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనిని ఆయన కొత్త ఏడాది సంక్రాంతి నుంచి ప్రారంభిస్తారు అని అంటున్నారు

తెలుగు ప్రజలకు పెద్ద పండుగ అయిన సంక్రాంతి నుంచి ఏపీ మన్ కి బాత్ ప్రసారం కానుంది. అయితే ఈ మన్ కీ బాత్ ఎలా ఉంటుంది అన్న దాని మీదనే చర్చ సాగుతోంది. ఇది ఆడియో రూపంలో ఉండాలా లేక వీడియో రూపంలో ఉండాలా అన్నది పరిశీలిస్తున్నారు. మొత్తానికి జనాలకు మరింత చేరువ కావలన్నది బాబు ఆలోచనగా ఉంది. సో బాబు కీ మన్ కీ బాత్ తొందరలోనే ఏపీ జనాలు వినే అవకాశం ఉంటుంది అన్నది లేటెస్ట్ న్యూస్.