Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి

ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఇవి సాధార‌ణ ఎన్నిక‌లు కావు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా విడుద‌ల చేసింది.

By:  Tupaki Desk   |   29 Jan 2025 9:29 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి
X

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేసణ విడుదల చేయనుండగా, అదే నెల 27న ఎన్నిక జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీతోపాటు ఉభయగోదావరి, క్రిష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనున్నారు. అదేవిధంగా తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీతోపాటు ఇదే జిల్లాల పట్టభద్రస్థానానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

షెడ్యూల్ విడుదల కావడంతో మొత్తం రెండు రాష్ట్రాల్లో ఆయా జిల్లా పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లైంది. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాల్సివుంటుంది. మొత్తం ఏడు ఉమ్మడి జిల్లాల్లో కోడ్ అమలులోకి రావడంతో కొత్తగా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను చేపట్టకూడదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను పక్కన పెడితే రెండు రాష్ట్రాల్లో మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నిక రసవత్తరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసిన కూటమి ఏడు నెలల కిందటే అభ్యర్థులను రంగంలోకి దింపింది. గోదావరి జిల్లాలకు కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, గుంటూరు-క్రిష్ణా జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో ఓటర్ల చేర్పులపై కూటమి నేతలు ప్రణాళిక ప్రకారం నడిచారు. అదేవిధంగా తెలంగాణలో రిటైర్ కాబోతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మళ్లీ పోటీకి విముఖత చూపుతున్నారు. ఆయన ఏదైనా నామినేటెడ్ పదవి లేదా రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. దీంతో ఈ స్థానంలో అభ్యర్థిని ఎవరిని నిలుపుతారనేది తెలియాల్సివుంద. మరోవైపు ఈ స్థానం నుంచి పోటీకి బీఆర్ఎస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నా, అధినేత కేసీఆర్ మాత్రం వద్దని వారిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏపీలో ప్రతిపక్షం వైసీపీ కూడా ఈ ఎన్నికలను బహిష్కరించే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.